Piyush Chawla UPL 2024:టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా ప్రస్తుతం యూపీ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్లో అతడు నోయిడా సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ లీగ్‌లో గోరఖ్‌పుర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో పీయూశ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగో ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో నోయిడా 91 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ పేలవ ప్రదర్శన తర్వాత పీయూశ్ తన 7ఏళ్ల కుమారుడి మాటలతో మోటివేట్ అయినట్లు చెప్పాడు. తర్వాత రెండో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నట్లు చావ్లా రీసెంట్గా ఓ స్పోర్ట్స్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
'యూపీ లీగ్ మ్యాచ్‌లో నేను 54 పరుగులు ఇచ్చాను. అంత ధారాళంగా పరుగులివ్వడం అదే నా కెరీర్లో అదే తొలిసారి. దీని గురించి నా కొడుకు (అద్విక్)తో ఫోన్లో చర్చించాను. ఆద్విక్ ఈ మ్యాచ్‌లో చాలా పరుగులిచ్చా అని అన్నాను. 'డోంట్ వర్రీ, నువ్వు బాగా బౌలింగ్ చేశావు' అని చెప్పాడు. ఆ తర్వాత లఖ్‌నవూతో మ్యాచ్‌కు ముందు నాకు ఫోన్ చేసి 'నిజమైన బాస్ ఎవరో అందరికీ చూపించు' అని అన్నాడు. 7ఏళ్ల పిల్లాడు అలా చెప్పడం నిజమైన మోటివేషన్. వినడానికి ఇది ఫన్నీగా ఉండవచ్చు. కానీ, నన్ను ఆ మాటలు బాగా ఉత్తేజపరిచాయి. ఆ మ్యాచ్‌లో నేను అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యా. ఆ మ్యాచ్ తర్వాక ఫోన్ చేసి 'నువ్వు రియల్ బాస్ అని చెప్పాను కదా!' అని అన్నాడు' అని చావ్లా పేర్కొన్నాడు.