Paris Olympics 2024 : ఒలింపిక్స్ 2024 బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో 21-13, 14-21, 16-21 తేడాతో మలేషియా ద్వయం ఆరోన్ - వూ ఇక్పై ఓడిపోయింది. తర్వాత రౌండ్లో ఈ మలేషియా ద్వయం చైనాకు చెందిన లియాంగ్ - వాంగ్ చాంగ్తో తలపడనుంది.
Sathwik Chirag _ వాస్తవానికి తొలి గేమ్‌లో సాత్విక్-చిరాగ్ ద్వయం ఆధిపత్యాన్ని చూపించింది. తొలి గేమ్‌ను దక్కించుకుంది. కానీ రెండో గేమ్‌లో మాత్రం మలేసియా జోడీ అద్భుతంగా రాణించింది.స ఓ దశలో 4-0తో వెనకబడిన ఆరోన్- సో వూయి ద్వయం అనంతరం వేగంగా పుంజుకుంది. అలా రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో గేమ్‌లో 2-5 తేడాతో వెనకబడిన భారత ద్వయం జోరు పెంచి 5-5తో, 16-16తో స్కోర్లు సమం చేసింది కానీ ఆ తర్వాత తేలిపోయింది.
లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్‌కు - 22 ఏళ్ల లక్ష్య సేన్ కార్వర్ ఫైనల్స్‌కు(Lakshya Sen) అర్హత సాధించాడు. మెన్స్ సింగిల్స్ ఈవెంట్లో స్టైట్ గేమ్స్‌లో హెస్ ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు. 39 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-12, 21-6 తేడాతో ఓడించాడు.
ముగిసిన ఆర్చర్ల పోరాటం - పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 64లో ప్రవీణ్ జాదవ్ ఓటమిని అందుకున్నాడు. 0-6 తేడాతో వెంచావో (చైనా) గెలుపొందాడు.
అథ్లెటిక్స్ నడకలో -అథ్లెటిక్స్ మెన్స్ 20 కి.మీ. నడకలో భారత అథ్లెట్లు వికాస్ సింగ్ 30వ స్థానం (1:22:36 నిమిషాలు), పరమ్‌జీత్ 37వ స్థానం (1:22:48 నిమిషాలు), ఆకాశ్‌దీప్ 50వ స్థానంలో నిలిచారు. ఉమెన్స్ 20 కి.మీ. నడకలో ప్రియాంక 41వ స్థానంలో( 1:39:55 నిమిషాలు) నిలిచింది.