Paris Olympics 2024 Opening Ceremony :ఈ ఏడాదిఒలింపిక్స్ వేడుక కోసం సర్వం సిద్ధమవుతోంది. ఈవెంట్‌కు ఇక 100 రోజులే సమయం ఉన్నందున నిర్వాహకులు కూడా జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. గ్రీస్‌లోని ఒలింపియాలో మంగళవారం (ఏప్రిల్ 16)న ఈ వేడుకకు సంబంధించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. అయితే చరిత్రలోనే తొలిసారిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఫ్రాన్స్‌లో ప్రవహించే సెన్ నది ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వేదిక కానుంది. అయితే కానీ భద్రతా కారణాల వల్ల అవసరమైతే ఈ వేదికను మారుస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఇటీవలే పేర్కొన్నారు. తీవ్రమైన భద్రత హెచ్చరికలు వస్తే స్టాడ్ డి ఫ్రాన్స్ జాతీయ స్టేడియంలోనే ఈ వేడుకలను నిర్వహిస్తామంటూ ఆయన చెప్పారు. అయితే ఈ ఈవెంట్‌ను కచ్చితంగా నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
నదిలో దాదాపు 6 కిలోమీటర్ల దూరానికి సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలనుకున్నారు. కానీ భద్రత కారణాల వల్ల దీన్ని 3 లక్షలకు పరిమితం చేశారు.