Paris Olympics 2024 Manu Bhaker Pistol Price : పారిస్ ఒలింపిక్స్ 2024లో మను బాకర్ రెండు మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు(డబుల్ మెడలిస్ట్) సాధించిన తొలి అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
అప్పటి నుంచి మను బాకర్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియా అంతా ఆమె గురించి చర్చంతా. ఆమె బ్రాండ్ వ్యాల్యూ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అయినప్పటికీ ఆమెపై సోషల్ మీడియాలో కొంతమంది నెగటివ్ కామెంట్లు చేశారు.
ఎందుకంటే మను బాకర్ ఎక్కడికి వెళ్లినా తన వెంట పతకాలను తీసుకెళ్లేది. దీంతో కొంత మంది రెండు మెడల్స్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకు మను బాకర్ కూడా దీటుగానే స్పందించింది. గట్టి సమాధానం చెప్పింది.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒలింపిక్స్‌లో తాను వాడిన పిస్టల్ ధరపై కొత్త చర్చ మొదలైంది. కొందరు ఆ పిస్టల్ ఖరీదు రూ. కోటి వరకు ఉంటుందని అంటున్నారు. మరి కొంతమంది అంత కన్నా ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు.
తాజాగా ఈ పిస్టల్ ధరపై సాగుతున్న చర్చ గురించి స్పందించింది మను బాకర్. ఆ పిస్టల్ ధర అంత ఉండదని, ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
"ఏంటి, కోట్ల రూపాయలా? అంత ఊహించుకోవద్దు. దాని ధర రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.85 లక్షల వరకు ఉంటుంది. అది కూడా ఒకేసారి అంత పెట్టి కొనుగోలు చేశాను. ధరల్లో కాస్త అటు ఇటూ తేడా ఉంటుంది. మోడల్ ఆధారంగా దాని ధర మారుతూ ఉంటుంది. కొత్త పిస్టల్ అయితే ఒక ధర, సెకండ్ హ్యాండ్ పిస్టల్ అయితే మరొక ధర ఉంటుంది. క్రీడల్లో మనం ఒక దశకు చేరుకున్నాక కొన్ని కంపెనీలు సదరు పిస్టళ్లను ఫ్రీగానూ ఇస్తాయి" అని మను బాకర్ పేర్కొంది.
షూటింగ్ కాకుండా ఏం ఇష్టం -షూటింగ్ కాకుండా ఏం ఇష్టమో, కోపం వచ్చినప్పుడు తాను ఎలా స్పందిస్తుందో చెప్పింది మను బాకర్. షూటింగ్‌ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని, తనకు అదే జీవితమని తెలిపింది. "వీలైనంత వరకు షూటింగ్ చేస్తూనే ఉంటాను. దేశం కోసం మెడల్స్ సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. షూటింగే నా మొదటి ప్రాధాన్యత. చాలా మంది నాకు కోపమే రాదని అనుకుంటారు. కానీ నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. దీని నుంచి కూడా ఏదైనా పాజిటివ్‌ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. క్రీడాకారిణిగా ఇది ఎంతో ముఖ్యమైన ప్రక్రియ" అని బాకర్ పేర్కొంది.
దుబాయ్‌లో దగ్గుబాటి రానా - భారత మహిళ క్రికెటర్లకు స్పెషల్ సర్ప్రైజ్ - Women T20 World Cup 2024
బంగ్లాతో రెండో టెస్టు - మూడో స్పిన్నర్ అతడేనా? - IND VS BAN Second Test Spinners