తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్లోరిడాలో భారీ వర్షాలు - పాకిస్థాన్ 'సూపర్ 8' ఆశలు ఆవిరి! - T20 world cup elimination

T20 world cup 2024 Pakisthan Elimination : టీ20 వరల్డ్ కప్-2024లో పాకిస్థాన్ కథ లీగ్ స్టేజ్‌‌లోనే ముగిసేలా ఉంది. ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచి, అదృష్టంతో సూపర్-8కు చేరాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి.

source The Associated Press
T20 world cup 2024 Pakisthan (source The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 6:51 PM IST

T20 world cup 2024 Pakisthan Elimination : టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు యూఎస్‌లోని మూడు నగరాలు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూయార్క్‌లో మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక ఫ్లోరిడా(ఫోర్ట్ లాడర్‌డేల్), డల్లాస్‌లో మ్యాచ్‌లు మిగిలున్నాయి. అయితే ఈ వారం కీలక మ్యాచ్‌లు జరగనున్న ఫ్లోరిడా, ఫోర్ట్ లాడర్‌డేల్‌లో భారీ వరదల కారణంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో స్థానిక అధికారులు సౌత్ ఫ్లోరిడా విమానాశ్రయాలకు వందలాది విమానాలను నిలిపివేశారు.

పాకిస్థాన్ ఆశలు ఆవిరి - ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ పాకిస్థాన్‌ సూపర్‌ 8 అవకాశాలకు గండికొట్టింది. ఇప్పటికే గ్రూప్‌ ఏ నుంచి సూపర్‌ 8కు భారత్ క్వాలిఫై అయింది. రెండో పొజిషన్‌ కోసం యూఎస్, పాకిస్థాన్‌ పోటీ పడుతున్నాయి. ఫోర్ట్ లాడర్‌డేల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్‌లో జూన్‌ 14న ఐర్లాండ్‌తో అమెరికా ఆడుతుంది. 16న ఐర్లాండ్‌తోనే పాక్‌ తలపడుతుంది.

యూఎస్‌, ఐర్లాండ్‌ను ఓడించినా లేదా వర్షంతో రద్దు అయినా, యూఎస్‌ సూపర్‌ 8కి క్వాలిఫై అవుతుంది. ఒకవేళ USA vs Ireland గేమ్ వర్షం కారణంగా రద్దు అయితే, ఆదివారం పాకిస్థాన్‌ గెలిచి కూడా ప్రయోజనం ఉండదు. అదే యూఎస్‌, ఐర్లాండ్‌తో ఓడిపోతే మాత్రం ఆదివారం పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది.

కాగా, యూఎస్‌ మూడు మ్యాచుల్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కానీ వారి నెట్‌ రన్‌ రేట్ +0.127కి తగ్గింది. ఇది పాకిస్థాన్‌కు కలిసొచ్చే అవకాశం. ఎందుకంటే వారి నెట్‌ రన్‌రేట్‌ USA కంటే మెరుగ్గా ఉంది. అంటే పాక్‌, ఐర్లాండ్‌ను స్వల్ప తేడాతో ఓడించినా, సూపర్ 8 దశకు అర్హత సాధించగలదు. కానీ ఎమర్జెన్సీ ప్రకటనతో మ్యాచ్‌లు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే పాక్‌ ఎలిమినేట్‌ కాక తప్పదు.

చిక్కుకుపోయిన లంక - ఇకపోతే ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న శ్రీలంక క్రికెట్ జట్టు ఫోర్ట్ లాడర్‌డేల్‌లో చిక్కుకుపోయింది. ఇప్పటికే ఇక్కడ జూన్‌ 12న జరగాల్సిన తొలి గేమ్ శ్రీలంక వర్సెస్ నేపాల్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ఇక శ్రీలంక జట్టు బుధవారం ఫోర్ట్ లాడర్‌డేల్ నుంచి కరేబియన్ దీవులకు వెళ్లాల్సి ఉంది. కానీ భారీ వర్షం, వరదలతో అక్కడే చిక్కుకుపోయారు. శ్రీలంక తమ ఫైనల్​ గ్రూప్ మ్యాచ్‌ను 17న సెయింట్ లూసియాలో నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు గేమ్స్‌లో రెండు ఓడిపోయింది. ఒకటి వర్షంతో రద్దు అయింది. అయినా లంకకు సూపర్ 8 దశకు చేరుకునే అవకాశం ఉంది.

నటాషాతో విడాకులు - ఆ కోచ్​తో హార్దిక్​ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్​! - Hardik Pandya Divorce

న్యూజిలాండ్ ఖేల్ ఖతం! - సూపర్ 8కు దూసుకెళ్లిన వెస్టిండీస్ - T20 Worldcup 2024

ABOUT THE AUTHOR

...view details