Babar Azam Legal Actions:పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తనను ట్రోల్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2024 వరల్డ్‌కప్‌లో పాక్ వైఫల్యానికి బాబర్ ముఖ్య కారణం అంటూ పలువురు మాజీ క్రికెటర్లు, యూట్యూబర్లు తనను కొన్ని రోజులుగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై బాబార్తోపాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా ఉంది. ట్రోల్స్ చేసిన వాళ్లందరి వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలను పాక్ క్రికెట్ బోర్డు సేకరించే పనిలో ఉంది. వాటిని పరిశీలించి చట్టపరంగా వాళ్లకు నోటీసులు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి పాక్ సూపర్- 8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. దీంతో ఆటగాళ్లు నసీం షా, ఉస్మాన్ ఖాన్, సీనియర్ మేనేజర్ వహబ్ రియాజ్ ఇప్పటికే పాక్ చేరుకున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్‌తోపాటు ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్, షాదబ్ ఖాన్, ఆజం ఖాన్ శనివారం పాక్ వెళ్లనున్నారు. ఇక పొట్టికప్‌లో విఫలమైనందుకు పాక్ క్రికెట్లో భారీ మార్పులు ఉంటాయని బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ, జట్టు కోచ్, కెప్టెన్ మార్పులు ఉంటాయని సమాచారం. అయితే బోర్డు అదేశాలను పాటించేందుకు తాను సిద్ధమేనని బాబర్ స్పష్టం చేశాడు.
ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ వల్లే జట్టు నిష్క్రమించాల్సి వస్తుందని పాక్ మాజీ ప్లేయర్ అహ్మద్ షెజాద్ ఆరోపించాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌లోనూ అదే జరిగిందని అన్నాడు. ఈ టోర్నీలో పాక్ గ్రూప్ దశకే పరిమితమై చాప చుట్టేసింది. గ్రూప్ దశలో పసికూన అమెరికా, టీమ్ఇండియా చేతిలో ఓడింది. తర్వాత ఐర్లాండ్, కెనడాపై గెలిచినా సూపర్- 8లో స్థానం దక్కించుకోలేకపోయింది.