Padma Awards P Sreejesh R Ashwin :భారత అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో టీమ్ఇండియా మాజీ హాకీ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ పీ ఆర్ శ్రీజేశ్కు పద్మ భూషణ్ అవార్డు దక్కగా, మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పద్మ శ్రీ పురస్కారం లభించింది.
భారత అథ్లెట్లకు పురస్కారాలు- శ్రీజేశ్కు పద్మ భూషణ్, అశ్విన్‌కు పద్మ శ్రీ - PADMA AWARDS
అథ్లెట్లకు పద్మ పురస్కారాలు- శ్రీజేశ్, అశ్విన్‌కు అవార్డులు- మరో ఇద్దరికి కూడా
PADMA Awards (Source : Associated Press)
Published : Jan 25, 2025, 9:44 PM IST
వీళ్లతోపాటు లెజెండరీ భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐ ఎం విజయన్, భారత మొట్టమొదటి పారాలింపిక్ బంగారు పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్ కూడా అత్యున్నత పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 139 మందికి పురస్కారాలు ప్రకటించింది. అందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.