Champions Trophy Top 10 Batters : ఏదైనా క్రికెట్ టోర్నమెంట్ మొదలవుతుందంటే అభిమానుల కళ్లన్నీ దానిమీదే ఉంటాయి. అది ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ టోర్నీ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానులు రికార్డుల గురించి పలు లెక్కలేసుకుంటారు. అయితే త్వరలోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కాబోతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
ఇప్పటిదాకా 9 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా 2025 ఎడిషన్ పదోది. ఈ తరుణంలో టోర్నీ చరిత్రలో ఇప్పటిదాకా అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- క్రిస్ గేల్ (వెస్టిండీస్) : ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, లజెండరీ క్రికెటర్ క్రిస్ గేల్. గేల్ 17 మ్యాచ్‌లో 791 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. 2006 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో గేల్ 474 పరుగులు చేసి, ఆ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
- మహేల జయవర్ధనే (శ్రీలంక) : ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే రెండో స్థానంలో ఉన్నాడు. జయవర్దనే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 22 మ్యాచుల్లో 742 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
- శిఖర్ ధావన్ (భారత్) : ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లలో మూడో స్థానం టీమ్ఇండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్‌ది. ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచుల్లో 701 పరుగులు సాధించాడు. టీమ్ఇండియా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో గబ్బర్ పాత్రే కీలకం. అందులో 5 మ్యాచుల్లో 363 పరుగులు సాధించి ' ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గానూ నిలిచాడు.
- కుమార సంగక్కర (శ్రీలంక) : ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో శ్రీలంక దిగ్గజం, వికెట్ కీపర్ కుమార సంగక్కర నాలుగో స్థానంలో ఉన్నాడు. 22 మ్యాచ్‌ల్లో 683 పరుగులు చేశాడు. టోర్నమెంట్లో సంగక్కర 4 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.
- సౌరభ్ గంగూలీ (భారత్) : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. తన అసాధారణ బ్యాటింగ్, నాయకత్వ లక్షణాలతో భారత్‌కు 2003లో తొలి ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. 13 మ్యాచ్‌ల్లో 665 పరుగులు చేశాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో గంగూలీది రెండో స్థానం.
- జాక్వెస్ కాలిస్ (దక్షిణాఫ్రికా) : ఈ లిస్టులో దక్షిణాఫ్రికా జట్టు నుంచి స్థానం సంపాదించిన ఏకైక ఆటగాడు జాక్వెస్ కలిస్. ఈ మాజీ ఆల్ రౌండర్ ఛాంపియన్స్ ట్రోఫీలో 17 మ్యాచ్‌ల్లో 653 పరుగులు చేశాడు.
- రాహుల్ ద్రవిడ్ (భారత్) : ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రాహుల్ ద్రావిడ్‌ది ఏడో స్థానం. టీమ్ఇండియా తరఫున మూడో ఆటగాడు. ఈ టోర్నమెంట్లో 19 మ్యాచ్‌ల్లో 627 పరుగులు సాధించాడు.
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా తరఫున ఈ జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక్క ఆటగాడు, దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్. పాంటింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 18 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేయగా, అందులో 4 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి.
- శివనారాయణ్ చంద్రపాల్ (వెస్టిండీస్) : ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం చంద్రపాల్ నిలిచాడు. టోర్నీలో 587 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు సైతం ఉన్నాయి.
- సనత్ జయసూర్య (శ్రీలంక) : శ్రీలంక లెజెండ్, అగ్రెసివ్ బ్యాటర్ సనత్ జయసూర్య ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్‌లో జయసూర్య 20 మ్యాచ్‌ల్లో 536 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది.
కాగా, ఈ లిస్ట్‌లో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 11వ స్థానంలో ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ 14వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ 529 పరుగులు బాదగా, రోహిత్ 481 రన్స్ చేశాడు.
15 Matches, 8 Teams, 1 Champion. It’s ALL ON THE LINE! 🏆
— ICC (@ICC) January 22, 2025
Action begins on 19 February ⏳#ChampionsTrophy pic.twitter.com/SpVWtGfHNB
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ప్రకటన- గిల్‌కు ప్రమోషన్, షమీ రీ ఎంట్రీ
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీపై పాకిస్థాన్ పేరుంటుందా?-కాంట్రవర్సీపై BCCI క్లారిటీ