తెలంగాణ

telangana

ETV Bharat / sports

​RCBలో కీలక మార్పు- ముంబయి కోచ్​ ఇకపై బెంగళూరుకు- 'ఈసాల కప్ నమ్​దే' - RCB BOWLING COACH IPL 2025

2025 ఐపీఎల్​ కోసం ఆర్సీబీ కీలక మార్పు- జట్టులోకి కొత్త బౌలింగ్ కోచ్- ఈసారి టార్గెట్ టైటిల్!​

RCB Coach IPL 2025
RCB Coach IPL 2025 (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 18, 2024, 7:40 PM IST

RCB Bowling Coach IPL 2025 :ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో కీలక మార్పు చేసింది. పురుషుల జట్టు బౌలింగ్​ కోచ్​గా ఓంకార్ సాల్విని నియమించిట్లు ఆర్సీబీ మేనేజ్​మెంట్ సోమవారం వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ముంబయి హెడ్​కోచ్​గా ఉన్న ఓంకార్ సాల్వీ, రానున్న ఐపీఎల్​ సీజన్​లో ఆర్సీబీకి బౌలింగ్ కోచ్​గా వ్యవహరించనున్నాడని పేర్కొంది.

'గత 8 నెలల వ్యవధిలో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ నెగ్గిన ఓంకార్ సాల్వి 2025 ఐపీఎల్ కోసం మాతో కలవనున్నాడు. ప్రస్తుతం డొమెస్టిక్ టోర్నీల్లో బిజీగా ఉన్న ఓంకార్, అవి పూర్తైయ్యాక ఆర్సీబీతో ప్రయాణం ప్రారంభించనున్నాడు' అని ఆర్సీబీ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఓంకార్ రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తున్నాడు.

ఆర్సీబీ బౌలింగ్ కోచ్​గా ఓంకార్ సాల్వీని సంతోషంగా స్వాగతిస్తున్నాం. అతడి అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పేస్ బౌలర్లను సాల్వీ అత్యుత్తమంగా తీర్చిదిద్దుతారు. ఇక డొమెస్టిక్ టోర్నీల్లో అతడు అత్యంత విజయవంతమైన వ్యక్తి అని ఇప్పటికే నిరూపితమైంది. మా కోచింగ్ స్టాఫ్​కు సరిపోయే సరైన వ్యక్తి అతడు. అతడి లీడర్​షిప్, టెక్నికల్ నాలెడ్జ్, అనుభవంతో డ్రెస్సింగ్ రూమ్​ వాతావరణం ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నా' అని ఆర్సీబీ డైరెక్టర్ మో బొబాట్ పేర్కొన్నాడు. ఇక మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్​ను ఆర్సీబీ ఇప్పటికే తమ జట్టు బ్యాటింగ్​ కోచ్​గా నియమించుకుంది.

భారీ మొత్తంలో వేలంలోకి

2025 రిటైన్షన్స్​లో ఆర్సీబీ ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సహా, రజత్ పటిదార్, యశ్ దయాల్​ను మాత్రమే కొనసాగించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, , కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్​, గ్లెన్ మ్యాక్స్​వెల్ లాంటి హిట్టర్లను వదులుకుంది. దీంతో ఆర్సీబీ రూ. రూ.83 కోట్ల భారీ మొత్తంతో వేలంలోకి వెళ్లనుంది.

ఆర్సీబీ రిటెన్షన్స్ 2025

  • విరాట్ కోహ్లీ - రూ.21 కోట్లు
  • రజత్ పటిదార్ - రూ. 11 కోట్లు
  • యశ్ దయాల్ - రూ. 5 కోట్లు

'RCBతో నా జర్నీ ముగిసిపోలేదు- ఆల్రెడీ వీడియో కాల్​లో మాట్లాడాను!'

ఐపీఎల్​ కెరీర్​పై విరాట్ హింట్- మరో మూడేళ్లు ఆర్సీబీతోనే!

ABOUT THE AUTHOR

...view details