Olympics Tarzan Johnny Weissmuller :ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ అనగానే అందరికీ మైఖేల్ ఫెల్ప్స్ లేదా మార్క్ స్పిట్జ్ గుర్తొస్తారు. అయితే వీరికంటే ముందే ఈ విశ్వ క్రీడల్లో ఓ స్విమ్మింగ్ సూపర్ స్టార్ ఉన్నాడు. అతడే జానీ వీజ్‌ముల్లర్ (Johnny Weissmuller). 1924 పారిస్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. అంతే కాదు హాలీవుడ్ మూవీస్‌లో టార్జాన్ పాత్రలో యాక్ట్ చేసి పాపులర్ అయ్యాడు. ఇంతకీ ఆయమ ఒలింపిక్స్ జర్నీ ఎలా మొదలైందంటే?
ఒలింపిక్ విజయాలు
1924 పారిస్ ఒలింపిక్స్‌లో వీజ్‌ముల్లర్ 100 మీటర్ల ఫ్రీస్టైల్, 400 మీటర్ల ఫ్రీస్టైల్, 4x200 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించాడు. వాటర్ పోలోలో కాంస్య పతకాన్ని కూడా గెలిచాడు. ఈ విజయాలతో పావో నుర్మి వంటి లెజెండ్స్‌ని వెనక్కినెట్టి హీరోగా మారాడు. 1912, 1920లో స్వర్ణం గెలిచిన ప్రసిద్ధ హవాయి సర్ఫర్ అయిన డ్యూక్ కహనామోకును వీజ్‌ముల్లర్ ఓడించాడు.
ఈ టార్జన్ ఓ రియల్ లైఫ్ హీరో
స్విమ్మింగ్ ద్వారా పాపులరైన జాన్, 1932లో 'టార్జాన్ ది ఏప్ మ్యాన్'లో టైటిల్ రోల్లో (టార్జన్) నటించాడు. తన సినీ కెరీర్లో అతడు మొత్తం 12 టార్జాన్ సినిమాల్లో నటించాడు. 1927 మిచ్‌గాన్‌లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో సోదరుడు పీటర్‌తో కలిసి 11 మంది ప్రాణాలను కాపాడిన ముల్లర్, రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు.
కొనసాగిన ఒలింపిక్ విజయాలు
వీస్‌ముల్లర్ 1928 ఆమ్‌స్టెర్‌డ్యామ్ ఒలింపిక్స్‌లో విజయాలను కొనసాగించాడు. మరో రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. వాటర్ పోలో టీమ్ కోసం ఆడటానికి 400 మీటర్ల ఫ్రీస్టైల్ నుంచి తొలగించకపోయుంటే ఉంటే మూడో పతకం కూడా ఖాతాలో వేసుకొనే వాడు.