తెలంగాణ

telangana

ETV Bharat / sports

జెట్ స్పీడ్​లో న్యూయార్క్​ స్టేడియం పనులు- ట్రక్కుల్లో మైదానానికి చేరిన పిచ్​లు - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Nassau Cricket Stadium New York: న్యూయార్క్​లోని నసావు క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఫ్లోరిడా నుంచి 10 పిచ్​లను ట్రక్కుల ద్వారా న్యూయార్క్​కు చేర్చినట్లు ఐసీసీ తెలిపింది.

New York Stadium
New York Stadium

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 3:56 PM IST

Updated : May 1, 2024, 4:15 PM IST

Nassau Cricket Stadium New York: 2024 టీ20 వరల్డ్​కప్​ టోర్నీలో భారత్- పాకిస్థాన్ మ్యాచ్​కు ఆతిథ్యమివ్వనున్న న్యూయార్క్​ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం (Nassau County International Cricket Stadium in New York) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా 10 పిచ్​లు బుధవారం న్యూయార్క్​కు చేరుకున్నాయి. ఈ పిచ్​లను ట్రక్కుల ద్వారా ఫ్లోరిడా నుంచి న్యూయార్క్​కు తీసుకువచ్చినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా, ఈ పిచ్​లన్నీ డ్రాప్- ఇన్ వికెట్ పిచ్​లు. ఈ రకమైన పిచ్​లు బ్యాటింగ్​కు అనుకూలిస్తాయి.

గతేడాది డిసెంబర్​ నుంచి ఫ్లోరిడాలో ఈ పిచ్​లను ప్రిపేర్ చేశారు. ఈ 10 పిచ్​లలో నాలుగింటిని స్టేడియం మధ్యలో మ్యాచ్​ల కోసం ఏర్పాటు చేయనున్నారు. ఈ పిచ్​లపైనే క్రికెట్ మ్యాచ్​లు జరుగుతాయి. కాగా, మిగిలిన 6 పిచ్​లను స్టేడియంలోనే ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకునేలా అక్కడక్కడా ఉంచనున్నారు. స్టేడియం నిర్మాణంలో ఈ కీలక ఘట్టం, ఆడిలైడ్ ఓవల్ పిచ్ క్యురేటర్ డామైన్ హాగ్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఈ పిచ్​లను ఫ్లోరిడా నుంచి న్యూయార్క్​కు రవాణా చేయడానికి 20 ట్రక్కులను ఉపయోగించినట్లు హాగ్ తెలిపారు. పిచ్​ ట్రాన్స్​పోర్ట్​ అంతా సజావుగానే జరిగినట్లు పేర్కొన్న హాగ్, పిచ్​లన్నీ మంచి కండీషన్​లో ఉన్నాయని చెప్పారు.

కాగా, ఈ స్టేడియం న్యూయార్క్​ ఈస్ట్​మేడ్​లోని ఐసెన్‌హోవర్ పార్క్​లో నిర్మిస్తున్నారు. 34 వేల సీటింగ్ కెపాసిటీతో, అంతర్జాతీయ మ్యాచ్​లకు అనుగుణంగా ఈ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. 2024 టీ20 వరల్డ్​కప్ టోర్నీ​లో ప్రతిష్ఠాత్మక భారత్- పాకిస్థాన్​ సమరంతో సహా మరో 8 మ్యాచ్​లకు ఈ స్టేడియం వేదికకానుంది. ఆస్ట్రేలియా ఆడిలైడ్ ఓవల్, న్యూజిలాండ్​ ఈడెన్ పార్క్ స్టేడియాల్లో మదిరి ఈ మైదానంలోనూ డ్రాప్- ఇన్​ పిచ్​ వాడుతున్నారు.

ఇక జూన్ 1న పొట్టి కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో జూన్ 3న శ్రీలంక- సౌతాఫ్రికా జట్లు ఇదే వేదికగా తలపడనున్నాయి. ఇదే స్టేడియంలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​ను జూన్ 9న ఢీకొట్టనుంది.

టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్,​ రాహుల్ ఔట్​ - ICC T20 World Cup 2024

వారిదే కీలక పాత్ర - ఐపీఎల్​లో ప్రపంచకప్​ జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే? - T20 world cup 2024

Last Updated : May 1, 2024, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details