Dhoni Kohli :క్రికెట్‌లో సుదీర్ఘకాలం కలిసి ఆడిన ప్లేయర్స్ మధ్య స్పెషల్ రిలేషన్ ఉంటుంది. ఇలాంటి స్నేహాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా మందికి మాజీ భారత కెప్టెన్ ఎంస్ ధోనీ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బాండింగ్ గుర్తుకొస్తుంది. అయితే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని చాలా కాలమైంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌ల సందర్భంలో ధోనీ, కోహ్లీ సన్నిహిత సంబంధాన్ని చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కుతోంది.
'నేను, విరాట్ కలిసినప్పుడు అలా చేస్తుంటాం' - కోహ్లీతో బంధంపై ధోనీ కామెంట్స్ - Dhoni Kohli
Dhoni Kohli : ధోనీ కెప్టెన్సీలోనే కోహ్లీ స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడన్న సంగతి తెలిసిందే. చాలా కాలం కలిసి వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తాజాగా కోహ్లీతో రిలేషన్‌పై ధోనీ స్పందించాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే?
Dhoni Kohli (source Getty Images)
Published : Aug 3, 2024, 8:03 PM IST
ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో కోహ్లీనే, ధోనీపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని, గౌరవాన్ని బయటపెట్టాడు. కానీ తాజాగా విరాట్‌తో ఉన్న ప్రత్యేక రిలేషన్ గురించి ‘తల’ ధోని మాట్లాడాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహీ మాట్లాడుతూ తాను, విరాట్ ఎప్పుడు కలిసినా, మాట్లాడుకోవడానికి సమయం కేటాయిస్తానని చెప్పాడు.
- పక్కకెళ్లి కబుర్లు చెప్పుకుంటాం
‘మేము చాలా కాలం పాటు భారతదేశం తరఫున క్రికెట్ ఆడాం. ప్రపంచ క్రికెట్ విషయానికి వస్తే అతడు (కోహ్లీ) అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. మిడిల్ ఓవర్లలో విరాట్‌తో కలిసి నేను ఎక్కువగా బ్యాటింగ్ చేయగలను. ఎందుకంటే మేం ఎక్కువగా టూడీలు, త్రీడీలు తీస్తాం. బ్యాటింగ్ చాలా ఎంజాయ్ చేసే వాళ్లం. మేము చాలా తరచుగా కలుసుకుంటాం అని కాదు, కానీ మాకు అవకాశం దొరికినప్పుడల్లా పక్కకు వెళ్లి కబుర్లు చెప్పుకుంటాం. కొంత సమయం వరకు, జీవితంలో ఏం జరుగుతుందనేది పంచుకుంటాం. అది మా రిలేషన్.’ అని ధోనీ చెప్పాడు. - ఎవరేం చేస్తున్నారు?
క్రికెట్ విషయానికొస్తే, విరాట్ కోహ్లీ రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 76 పరుగులతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ఆడుతున్నాడు. ధోనీ, మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌లో రాణించాడు. 11 ఇన్నింగ్స్‌లలో 220.54 స్ట్రైక్ రేట్‌తో 53.66 యావరేజ్‌తో 161 పరుగులు చేశాడు. 2025 ఐపీఎల్ ఆడుతాడా? లేదా? అనే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- ప్రత్యేక ప్రతిభావంతుల కోసం నిధుల సేకరణ
ముంబయి, BKCలోని ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలను నిర్వహిస్తున్న విప్లా ఫౌండేషన్ కోసం ఫండ్స్ సేకరించేందుకు అథియా శెట్టి, ఆమె భర్త కేఎల్ రాహుల్ టాప్ క్రికెటర్లతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భారత క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, చాహల్, పంత్, సంజు శాంసన్, జడేజా భాగస్వామ్యమయ్యారు. అలానే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్, ఇతర క్రికెట్ స్టార్లు జోస్ బట్లర్, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్‌ను భాగం చేశారు. ఈ క్రికెటర్లు అందజేసే ప్రత్యేక వస్తువులతో వేలం నిర్వహించనున్నారు.
తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అథియా ఈ విషయం గురించి మాట్లాడుతూ, ‘రాహుల్, నేను, క్రికెట్ ఫర్ ఏ కాజ్: టు బెనిఫిట్ విప్లా ఫౌండేషన్ అనే క్రికెట్ వేలం నిర్వహిస్తున్నామని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయం వినికిడి లోపం, వైకల్యం ఉన్న పిల్లలకు ఉపయోగపడుతుంది.’ అని తెలిపింది. విప్లా ఫౌండేషన్‌ను స్థాపించిన తన నాని వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని ఆథియా పేర్కొంది.
'తలా ఫర్ ఏ రీజన్'పై స్పందించిన ధోనీ - ఈ ట్రెండ్ గురించి ఏమన్నాడంటే? - Thala for a Reason
కోహ్లీ బయోపిక్ కోసం 8 మంది హీరోలు - ఎవరు సెట్ అవుతారంటే? - Virat Kohli Biopic Heros