Mohammed Shami Border Gavaskar Trophy :టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెండో టెస్టు సమయానికి అతడు ఆసీస్‌కు చేరుకుంటాడని అందరూ అనుకున్నారు. ఇక రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ఫామ్ కనబరిచినందున త్వరగానే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని అన్నారు. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలోనూ మంచి ధరనే దక్కించుకున్నాడు.
అయితే, బీసీసీఐ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే షమీని ఆసీస్‌కు ఇప్పుడే పంపించట్లేదంటూ తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇందుకుగానూ బీసీసీఐ రెండు కండీషన్లు పెట్టిందని, ఈ క్రమంలో డెడ్‌లైన్‌లోగా వాటిని రీచ్ అయితే ఆసీస్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"బీసీసీఐ మెడికల్ టీమ్ షమీని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అతడు ఏ రకంగా బౌలింగ్ చేస్తున్నాడన్న విషయాన్ని కూడా గమనిస్తోంది. అయితే మెడికల్ టీమ్ నుంచి నో అబ్జెక్షన్ ఫామ్ వస్తేనే షమీ రీఎంట్రీపై బీసీసీఐ ఓ నిర్ణయానికొచ్చే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచుల్లోనూ షమీ బౌలింగ్‌పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. కానీ, టీ20ల్లో కేవలం నాలుగు ఓవర్ల స్పెల్‌ను బేస్ చూసుకుని అతడి ఫిట్‌నెస్‌పై ఓ ఫైనల్ డెసిషన్‌కు వచ్చే అవకాశం లేదు. అయితే షమీని పరిగణనలోకి తీసుకోవాలంటే మాత్రం అతడు రెండు విషయాల్లో పాస్ అవ్వాల్సిందే. అది కూడా డిసెంబర్ రెండో వారంలోపే సాధ్యపడాల్సి ఉంటుంది. ఆసీస్‌తో డిసెంబర్ 14న ప్రారంభమయ్యే మూడో టెస్టు సమయానికి జట్టుతో పాటు చేరాలంటే బరువు తగ్గాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఫుల్ ఫిట్‌నెస్ సాధించాలి. మరోవైపు వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సీనియర్ బౌలర్‌పై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని బోర్డు చూస్తోంది" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
షమీ ఏజ్ కాంట్రవర్సీ- వయసు 34 కాదు, 42 అంట- ఇదే ప్రూఫ్!
రంజీలో షమీ వికెట్ల వేట - ఆ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్, బీసీసీఐకి ఒకే ఆన్సర్!