Border Gavaskar Trophy Shami :టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ నవంబర్‌లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవ్వలేదు. ఫిట్‌నెస్ కారణాల వల్ల సెలక్టర్లు షమీని పక్కన పెట్టారు. అయితే ఏడాదిపాటు క్రికెట్‌కు దూరంగా ఉంటున్న షమీ, ఈ పర్యటనతో టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు.
కానీ, షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల చోటు దక్కలేదు. దీంతో ఫిట్‌నెస్ విషయంలో అందరి అంచనాలను అందుకోలేక పోయినందుకు బీసీసీఐ, ఫ్యాన్స్‌కు షమీ సారీ చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను షమీ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. ఫిట్‌నెస్ ట్రైనర్ సహాయంతో తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్నట్లు వీడియోలో ఉంది.
'రోజు రోజుకూ బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నా. మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఇంకా శ్రమిస్తా. దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తా. క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి సారీ చెబుతున్నా. టెస్టు క్రికెట్ ఆడేందుకు త్వరలోనే మీముందుకొస్తా' అని షమీ షోస్టు షేర్ చేశాడు. ఇక షమీ త్వరగా టీమ్ఇండియాలోకి రావాలని, అతడి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.