Moeen Ali Retirement : ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అభిమానులకు షాకిచ్చాడు. 2014లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన కెరీర్లో ఇప్పటి వరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 6,600కిపైగా స్కోర్ సాధించాడు. ఇక బౌలింగ్‌లోనూ రాణించిన ఈ క్రికెటర్ ఇప్పటివరకూ 360+ వికెట్లను పడగొట్టి రికార్డుకెక్కాడు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మొయిన్ అలీ అందులోనూ ఆడిన 67 మ్యాచుల్లో 1,162 పరుగులు, 35 వికెట్లు తీసి చరిత్రకెక్కాడు.
"నాకిప్పుడు 37 ఏళ్లు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు నేను ఎంపిక కాలేదు. మున్ముందు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పటికే ఇంగ్లాండ్ తరఫున చాలా మ్యాచ్‌లు ఆడేశాను. ఇక కొత్త తరం జట్టులోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. నేను రిటైర్‌మెంట్ తీసుకున్నప్పటికీ, నాకేం బాధగా లేదు. ఇప్పటికీ క్రికెట్ ఆడగలను. కానీ, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే సరైన సమయం అని భావించాను" అని అలీ తాజాగా తన రిటైర్మెంట్పై స్పందించాడు.