తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి Vs ఆర్సీబీ - ఈ ఆటలో ఇద్దరూ గెలవాల్సిందే! - MI Vs RCB IPL 2024 - MI VS RCB IPL 2024

MI Vs RCB IPL 2024 : ఐపీఎల్ 17లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో వాళ్ల బలాబలాలు గురించి తెలుసుకుందామా.

MI Vs RCB IPL 2024
MI Vs RCB IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 10:45 AM IST

MI Vs RCB IPL 2024 :ఐపీఎల్ 17లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్​ జరగనుంది. స్టార్‌ ఆటగాళ్లకు కొదవ లేని జట్లు అవి. అయితే కానీ ఈ సీజన్​లో ఈ రెంటు టీమ్స్​కు అంతగా కలిసి రావడం లేదు.

ఓ వైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆడిన అయిదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓటమి చవి చూసింది. మరోవైపు హ్యాట్రిక్‌ పరాజయాలతో టోర్నీని మొదలుపెట్టి కేవలం ఒక్క గెలుపుతోనే సరిపెట్టుకుంది ముంబయి ఇండియన్స్‌. దీంతో అభిమానుల్లో సందిగ్దత మొదలైంది. ఆర్సీబీ మరో మ్యాచ్​లో ఓడితే, ఆ తర్వాత వేగం పుంజుకుని ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకెళ్లడం కష్టమవుతుందని విశ్లేషకుల మాట.

ఇదిలా ఉండగా, ముంబయి కూడా ఇంకో ఓటమి చవిచూస్తే ఆ జట్టుకూ ఇబ్బందులు తప్పే సూచనలు లేనట్లు తెలుస్తోంది. దీంతో గెలిచి తీరాల్సిన ఈ పోరులో మ్యాచ్‌లో ఈ రెండు జట్లూ ఎలా పోరాడతాయి, చివరికి ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారనుంది. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్​ పెర్ఫామెన్స్​తో ముంబయి జట్టును గెలిపించారు రొమారియో షెఫర్డ్‌. దీంతో ఈ స్టార్ క్రికెటర్​పైఅందరి దృష్టీ నిలిచి ఉంది.

మరోవైపు బెంగళూరు జట్టులోనూ ఒంటరి పోరాటం చేస్తున్న కోహ్లీ గురించి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. వీరితో పాటు మిగతా ప్లేయర్లు కూడా రాణిస్తే ఇక బెంగళూరుదే పై చేయిగా నిలవనుంది. అయితే రోహిత్, సుర్య కూమార్​ కూడా మెరుగైన ఆటతీరు కనబరిస్తే ముంబయి జట్టు కూడా గట్టి పోటినివ్వగలదని విశ్లేషకుల మాట.

ముంబయి ఇండియన్స్ తుది జట్టు (అంచనా) :
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్​), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా
సబ్​స్టిట్యూట్ : ఆకాశ్​ మధ్వల్

ఆర్సీబీ తుది జట్టు (అంచనా) :
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టాప్లీ, మయాంక్ డాగర్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్
సబ్​స్టిట్యూట్స్​ : మహిపాల్ లోమ్రోర్, ఆకాశ్ దీప్​.

'నాది త్యాగం కాదు, ప్రేమ'- ధోనీ రిటైర్మెంట్​పై సాక్షి కామెంట్స్ - Dhoni Test Cricket Retirement

2025 IPL మెగా వేలం- ఫ్రాంచైజీ ఓనర్స్​ మీటింగ్ వాయిదా - Ipl 2025 Mega Auction

ABOUT THE AUTHOR

...view details