Mayank Agarwal Health Update: విమానంలో మంచి నీళ్లని అనుకుని హానికర ద్రవం తాగిన భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న మయాంక్ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. "ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. త్వరలోనే నేను బయటకు వస్తాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి, నాపై ప్రేమ చూపుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ తన ఫొటో షేర్ చేశాడు.
మయాంక్ హెల్త్ అప్డేట్ :అస్వస్థతకు గురైన మయాంక్‌ను స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అయితే చికిత్స పొందిన మయాంక్ ఇప్పుడు డిస్చార్జ్ అయ్యాడు.
ఇదీ జరిగింది:మయంక్ అగర్వాల్ అగర్తలా నుంచి దిల్లీ వెళ్తుండగా ఫ్లైట్‌లో తన సీట్ ఎదురుగా ఉన్న బాటిల్లోని పానియాన్ని నీళ్లు అనుకొని తాగాడు. దీంతో వెంటనే అతడికి రెండుసార్లు వాంతులయ్యాయి. తర్వాత గొంతులో మంట ప్రారంభమైంది. అప్రమత్తమైన విమాన సిబ్బంది, అతడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించింది. మయంక్‌కు ఎలాంటి ప్రమాదం లేదని హాస్పిటల్ వర్గాలు మంగళవారం రాత్రే పేర్కొన్నాయి. ఈ విషయంపై మయంక్ మేనేజర్ అగర్తలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరారు.