Manu Bhaker PM Modi:భారత స్టార్ షూటర్ మను బాకర్ ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలతో సత్తా చాటింది. అయితే తాను 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ నెగ్గినప్పుడు, 2020 టోక్యో ఒలింపిక్స్ చేదు అనుభవం ఎదురైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగతంగా జరిగిన సంభాషణను షేర్ చేసుకుంది. తాను కెరీర్లో విజయం సాధిస్తుందని ఆమెకు 16ఏళ్లప్పుడే మోదీ చెప్పారట. ఈ విషయాలను మును బాకర్ గురువారం నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా గుర్తుచేసుకుంది.
2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో పసిడి ముద్దాడిన మనుకు తొలిసారి ప్రధాని మోదీని కలిసే ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో మోదీతో జరిగిన చిట్‌చాట్ గురించి చెప్పింది. 'కామన్వెల్త్ గేమ్స్‌లో నెగ్గినప్పుడు మోదీజీని కలిశాను. అప్పుడు నా వయసు 16ఏళ్లు. అప్పుడు ఆయన నువ్వు ఇంకా చిన్నదానివి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు మీరు అందుకుంటారు. మీకు ఏ అవసరం ఉన్నా నన్ను కలవచ్చు అని మోదీ అన్నారు' అని బాకర్ పేర్కొంది.
ఇక టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి సమయంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా గుర్తు చేసుకుంది. 'టోక్యోలో ఓటమి తర్వాత ఆయన మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. నా లక్ష్యం పైనే దృష్టి ఉంచాలని ఆయన సూచించారు. ఆ ప్రోత్సాహంతోనే నా ఫ్యూచర్ ప్లాన్ స్టార్ చేశాను' అని మను తెలిపింది. ఇక పీఎం మోదీ ప్రతి అథ్లెట్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారని మను ఈ సందర్భంగా చెప్పింది. 'ఫలితంతో సంబంధం లేకుండా ప్రతి ప్లేయర్‌తో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతారు. అందరితో వ్యక్తిగతంగా చర్చించి, వారి సమస్యలు తెలుసుకొని ప్రోత్సహిస్తారు' అని మను పేర్కొంది.