Manu Bhaker Favourite Cricketer : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి క్రీడాభిమానుల్లో సూపర్ క్రేజ్ సంపదించికుంది స్టార్ షూటర్ మనుబాకర్. తన అత్యద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అందరినీ అబ్బురపరిచి ట్రెండ్‌లో నిలిచింది. ఇక అభిమానులు కూడా ఈమె ఇష్టాఇష్టాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరట్ క్రికెటర్ల పేర్లు రివీల్ చేసింది. అంతే కాకుండా తనకు ఇన్స్పిరేషన్గా నిలిచిన ఓ స్టార్ అథ్లెట్ గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ వారెవరంటే?
"నాకు చాలామంది ప్లేయర్లంటే ఇష్టం కానీ అందులో కొంతమంది పేర్లను మాత్రమే ఇప్పుడు రివీల్ చేస్తాను. టీమ్ఇండియాలో ముగ్గురు క్రికెటర్లు నా ఫేవరెట్. వారే సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. ఈ ముగ్గురితో ఒక్క గంట సమయమైనా వెచ్చించినా ఎంతో గౌరవంగా అనిపిస్తుంది. వారితో కాసేపు మాట్లాడినా కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఇక జమైకా స్టార్ రన్నర్ ఉసేన్ బోల్ట్ నా ఇన్స్పిరేషన్. ఆయన బయోపిక్ కూడా చదివాను. బోల్ట్ ప్రయాణం నాకెప్పుడూ ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. బుక్సే కాదు ఆయనకు సంబంధించిన చాలా ఇంటర్వ్యూలు చూశాను. " అని మను బాకర్ పేర్కొంది.
ఆ టాటూ వల్లే నేను ఇలా ఉన్నాను
టోక్యో ఒలింపిక్స్ నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ వైఫల్యాన్ని దాటుకుని నేను ముందుకు సాగాలని అనుకున్నప్పటికీ రోజు రోజుకూ అది మరింత కఠినంగా మారింది. ఆ సమయంలోనే నేను ఓ టాటూ వేసుకోవాలని అనుకున్నా. అదే నన్ను ముందుకు నడిపిస్తుందని అనుకున్నాను. (Still I Rise) 'నేను మళ్లీ పైకి లేస్తా' అని దానికి అర్థం. అది నాకెంతో నచ్చిన టాటూ. అది నాలో ఎంతో ఇన్స్పిరేషన్ నింపింది.