Kl Rahul Lsg Captaincy:లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సన్‌రైజర్స్‌పై ఘోర ఓటమి తర్వాత ఫ్రాంచైజీ ఓనర్‌తో జరిగిన సంభాషణ వీడియో చక్కర్లు కొట్టడం వల్ల ఈ వార్తలకు తెరలేచింది. ఈ సీజన్లో లఖ్‌నవూ ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లకు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించకపోవచ్చని సమాచారం.
'లఖ్‌నవూ మే14న దిల్లీతో తలపడనుంది. అంటే దాదాపు వారం రోజుల గ్యాప్ ఉంది. ఈ సమయంలో రాహుల్ బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కెప్టెన్సీ వదిలేసే ఛాన్స్ ఉంది. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు' అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కే కాకుండా మొత్తం ఫ్రాంచైజీకే రాహుల్ గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, లఖ్‌నవూ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం తప్పనిసరి.
మెగా వేలంలో ఉంటాడా? 2022 సీజన్లో లఖ్‌నవూ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి లఖ్‌నవూకు రాహులే సారథ్యం వహిస్తున్నాడు. వరుసగా రెండేళ్లు (2022, 2023) ప్లేఆఫ్స్‌కు కూడా చేర్చాడు. ఈ సీజన్లోనూ ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన లఖ్‌నవూ సెకండ్ హాఫ్‌లో తడబడింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే లఖ్‌నవూకు టాప్- 4లో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. లేదంటే టోర్నీ నుంచి వైదొలుగుతుంది. దీంతో వచ్చే సీజన్‌నాటికి మెగావేలంలో రాహుల్‌ను రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువే అన్నట్లు వార్తలు వస్తున్నాయి.