Novak Djokovic Poisoned : టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ సంచలన ఆరోపణ చేశాడు. తనపై విషప్రయోగం జరిగినట్లు తెలిపాడు. 2022లో మెల్బోర్న్లోని ఓ హోటల్లో తనకు విషపూరిత ఆహారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. సీసం, పాదరసం కలిసి ఉన్న ఆహారాన్ని ఇచ్చి తనను ఇబ్బందిపెట్టినట్లు వెల్లడించాడు.
కాగా, కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా 2002లో ఆస్ట్రేలియా నుంచి జకోవిచ్‌ను డిపోర్ట్ చేశారు. అలాగే అతడి వీసాను రద్దు చేసి అతన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనక్కి పంపించేశారు. అయితే ఆ ఏడాది జరిగిన ఘటన గురించి తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు.
"ఆస్ట్రేలియాలో క్వారంటైన్ సమయంలో నాకు విషపూరిత ఆహారం ఇచ్చారు. దీంతో శరీరంలో మెర్కురీ, లెడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నాను. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. సెర్బియాకు తిరిగి వెళ్లిన తర్వాత కొన్ని విషయాలు గుర్తించాను. కానీ ఆ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పలేదు. ఎందుకంటే నా శరీరంలో అధిక స్థాయిలో మినిరల్స్ ఉన్నట్లు గుర్తించాను. కొన్ని రోజులు ఫ్లూతో బాధపడ్డాను. ఇంట్లోనే ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది." అని జకోవిచ్ తెలిపాడు.
'అది రాజకీయ ప్రేరేపిత చర్య'
2022లో తనను ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించడం రాజకీయ ప్రేరేపిత చర్య అని జకోవిచ్ మండిపడ్డారు. కొవిడ్ టీకా విషయంలో తనపై చర్యలు తీలుకోలేదని ఆరోపించారు. ప్రజలు తనను వ్యాక్సిన్ వ్యతిరేక భావాలకు హీరోగా చూస్తున్నారని అన్నారు. ఆరోగ్య సమస్యల కంటే రాజకీయాలే తనను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి బహిష్కరించేలా చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
" రాజకీయమే నన్ను ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించడానికి అసలు కారణం. అక్కడి నాయకులు నేను ఉండటాన్ని సహించలేకపోయారు. ఆ సమయంలో నన్ను ప్రపంచానికి నంబర్ వన్ విలన్‌గా చూపించారు. నేటికీ 99 శాతం మందికి నన్ను ఆస్ట్రేలియా నుంచి ఎందుకు బహిష్కరించారో తెలియదు. కొవిడ్ టీకా తీసుకోనందున నన్ను ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించారని ప్రజలు భావిస్తున్నారు. బలవంతంగా ఆస్ట్రేలియాలోకి చొరబడటానికి ప్రయత్నించాననేది పూర్తిగా అవాస్తవం." అని జకోవిచ్ తెలిపాడు.
ప్రేక్షకులపై జకోవిచ్ ఫైర్ - ఇంటర్వ్యూ మధ్యలో నుంచే జంప్! - Novak Djokovic Fire on Audience