ETV Bharat / sports

హిందీపై కాంట్రవర్సీయల్ కామెంట్స్! - వివాదాల్లో చిక్కుకున్న అశ్విన్! - ASHWIN COMMENTS ON HINDI LANGUAGE

భారత మాజీ ఆల్ రౌండర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు- హిందీ అధికారిక భాష కాదని కామెంట్లు- సోషల్ మీడియాలో చర్చ

Ashwin Comments On Hindi Language
Ashwin (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Ashwin Comments On Hindi Language : ఇటీవలే క్రికెట్​కు వీడ్కోలు పలికిన టీమ్​ఇండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా వివాదాల్లోకి చిక్కుకున్నాడు. తన మాటల కారణంగా వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో హిందీ భాష గురించి ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

అసలేం జరిగిందంటే?
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాడు. అయితే తన ప్రసంగాన్ని ఏ భాషలో వినాలనుకుంటున్నారని విద్యార్థులను అడిగాడు. అశ్విన్ మొదట ఇంగ్లిష్​లో వింటారా అని వారిని అడిగాడు. కానీ వారి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత తమిళంలో మాట్లాడాలా అని అన్నాడు. దానికి అక్కడి స్టూడెంట్స్​ అంతా ఎనర్జిటిక్​గా బదులిచ్చారు. చివరికి హిందీలో మాట్లాడాలా అని అడగ్గా, దానికి విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు. అప్పుడు అశ్విన్ 'హిందీ మన జాతీయ భాష కాదు. అధికారిక భాష మాత్రమే' అని అన్నాడు. అయితే ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

సోషల్ మీడియాలో చర్చ
మరోసారి అశ్విన్ తన వ్యాఖ్యల కారణంగా చర్చనీయాంశంగా మారాడు.అశ్విన్ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. హిందీ భాషపై అశ్విన్ చేసిన కామెంట్లపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది అశ్విన్ వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు అశ్విన్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

అశ్విన్ రిటైర్మెంట్
టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్​లో 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు, 3503 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉండటం విశేషం. ఇక 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.

టెస్ట్ ర్యాంకింగ్స్​లో బుమ్రా అదుర్స్! - దెబ్బకు అశ్విన్‌ రికార్డును సమం!

'అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించా - ధోనీకి ఇతర కెప్టెన్లకు తేడా అదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.