Shreyas Iyer IPL 2024:ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో ఐపీఎల్ టైటిల్ సాధించిన 8వ కెప్టెన్‌గా అయ్యర్ రికార్డులకెక్కాడు. దాదాపు 10ఏళ్లుగా సాధించలేకపోతున్న ట్రోఫీ కలను నిజం చేశాడు. దీంతో కేకేఆర్ సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ శ్రేయస్ కూడా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయాడు. టైటిల్ పట్టుకొని హోటల్ రూమ్‌లో డ్యాన్స్ చేశాడు. కేక్ కట్‌చేసి కేకేఆర్ ప్లేయర్లు ఈ విక్టరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
అలా మొదలైంది
శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి దాదాపు 6 సీజన్లపాటు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2015లో అయ్యర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా పొందాడు. ఆ తర్వాత పలు సీజన్లలో దిల్లీకి కూడా కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్ 2020లో జట్టను ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇక ఫైనల్లో దిల్లీ ముంబయి చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇక 2022లో కోల్‌కతాతో చేరిన తర్వాత ఇక్కడ కూడా అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రెండు సీజన్లలో జట్టు 6వ స్థానానికే పరిమితమైంది. ఇక గంభీర్ రాకతో కెప్టెన్సీలోనూ మెరుగైన అయ్యర్ ఈసారి లీగ్ దశ నుంచే జట్టను సమర్థవంతంగా నడిపించాడు. అదే పట్టుదలతో అయ్యర్ ట్రోఫీ సాధించాడు. అంటే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన 9ఏళ్లకు అయ్యర్ టైటిల్ సాధించాడు. ఈ క్రమంలో ధోనీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తర్వాత ఐపీఎల్ టైటిల్ కొట్టిన 5వ ఇండియన్ కెప్టెన్‌గా రికార్డు అందుకున్నాడు.