Khel Ratna Award 2025 :ప్రతిష్టాత్మకమేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. దిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అవార్డు గ్రహీతలైన అథ్లెట్స్ పాల్గొని సందడి చేశారు. హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, చెస్ విభాగంలో డి.గుకేశ్, షూటింగ్ విభాగంలో మను బాకర్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ జివాంజీ దీప్తి, జ్యోతి యర్రాజీ కూడా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు.
ఇక వీరితో పాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు అథ్లెట్లు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో బ్యాడ్మింటన్ స్టార్ మురళీధరన్, ఫుట్‌బాల్ ప్లేయర్ అర్మాండో ఆగ్నెలో కొలాకో రాష్ట్రపతి చేతుల మీద ఈ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.
అర్జున అవార్డు అందుకున్న అథ్లెట్స్ :
అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతూ (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), సలీమా(హాకీ), వంతిక అగర్వాల్(చెస్), అభిషేక్ (హాకీ), అభయ్ సింగ్(స్క్వాష్), సంజయ్(హాకీ), హర్మన్‌ప్రీత్ సింగ్(హాకీ), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), స్వప్నిల్ సురేశ్ కుసాలే(షూటింగ్), సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్), సుఖ్‌జీత్ సింగ్(హాకీ), అమన్ (రెజ్లింగ్).
అర్జున అవార్డు అందుకున్న పారా అథ్లెట్స్ :
రాకేశ్ కుమార్(పారా ఆర్చర్), సిమ్రాన్(పారా అథ్లెటిక్స్), మనీశా రాందాస్(పారా బ్యాడ్మింటన్), ప్రీతి పాల్(పారా అథ్లెటిక్స్), హెచ్. హోకాటో(పారా అథ్లెటిక్స్), అజీత్‌సింగ్(పారా అథ్లెటిక్స్), సచిన్ సర్జేరావు ఖిలారి(పారా అథ్లెటిక్స్), ప్రణవ్(పారా అథ్లెటిక్స్), నిత్యశ్రీ సుమతి శివన్(పారా బ్యాడ్మింటన్), నవ్‌దీప్(పారా అథ్లెటిక్స్), నితీశ్ కుమార్(పారా బ్యాడ్మింటన్), తులసీమతి మురుగేశన్(పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్(పారా జూడో), మోనా అగర్వాల్(పారా షూటింగ్), రుబినా ఫ్రాన్సిస్(పారా షూటింగ్).