తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఝార్ఖండ్‌ ఎన్నికల బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ - DHONI JHARKHAND ELECTIONS 2024

ఝార్ఖండ్‌లో జరగనున్న ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ!

Jharkhand Elections 2024 MS Dhoni Brand Ambassador
Jharkhand Elections 2024 MS Dhoni Brand Ambassador (source Associated Press and ANI)

By ETV Bharat Sports Team

Published : Oct 26, 2024, 11:12 AM IST

Jharkhand Elections 2024 MS Dhoni Brand Ambassador : త్వరలోనే ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ తెలిపారు.

"అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫొటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ అంగీకరించారు. ఇతర వివరాలపై త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతాము. ఓటర్లలో ఓటుహక్కుపై చైతన్యం కలిగించేందుకు మహీ కృషి చేస్తారని భావిస్తున్నాం" అని ఆయన వెల్లడించారు.

కాగా, ఓటర్లలో అవగాహన పెంచేందుకు స్వీప్‌ (సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలోనే ధోనీ కృషి చేయనున్నారు. మొత్తం 81 స్థానాలకు నవంబరు 13, 20న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబరు 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తైంది.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్- పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!

భారత్ లక్ష్యం 358 - నాలుగో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా భారీ ఛేజింగ్‌లు ఇవే

ABOUT THE AUTHOR

...view details