Jasprit Bumrah Shoe Cost : క్రికెట్ ఆటగాళ్లకు వాళ్ల ఆరోగ్యమే ప్రధానం. వీటిని రక్షించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకొంటారు. ఉత్తమ ప్రొడక్టులను వినియోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్‌గా భారత స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా తరఫున మూడు ఫార్మాట్‌లలో అదరగొడుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ టీమ్‌కి విజయాలు అందిస్తున్నాడు.
అయితే బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్లు తాము ధరించే షూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ షూస్ మైదానంలో తమ పనితీరును మెరుగుపరచడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంతకీ బుమ్రా ఏ బ్రాండ్ షూ ధరిస్తాడు? వాటి ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
బుమ్రా 'షూ' సెలక్షన్
ఆసిక్స్ (Asics) అనే టాప్ స్పోర్ట్స్ బ్రాండ్‌లతో కలిసి పని చేస్తున్నాడు బుమ్రా. ఈ కంపెనీ క్రికెట్-స్పెసిఫిక్ పాదరక్షలకు ప్రసిద్ధి చెందింది. ఆసిక్స్ క్రికెట్ షూలు బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ సమయం బౌలింగ్ చేయడానికి అవసరమైన గ్రిప్, కుషనింగ్, స్టెబిలిటీ అందిస్తాయి. మోడల్, పర్ఫార్మెన్స్ టెక్నాలజీ బట్టి ఈ షూల ధర మారుతుంటుంది. సాధారణంగా రూ.5,000 నుంచి రూ.15,000 వరకు ఉంటాయి.