Ishan Kishan Unhappy BCCI:టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ సెలక్షన్ కమిటీ మేనేజ్మెంట్పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతనెల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు తనను పక్కనపెట్టి, జితేశ్ శర్మను జట్టులోకి తీసుకోవడం పట్ల ఇషాన్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్‌లో జితేశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. దీంతో జితేశ్ 2024 టీ20 వరల్డ్ కప్ రేస్‌లోనూ ఉన్నాడన్న ప్రచారం సాగుతోంది.
అయితే అఫ్గాన్ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు, యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. వన్ డౌన్లో విరాట్ కోహ్లీ, నెం.4లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ క్రమంగా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. ఇక మిడిలార్డర్లో జితేశ్, జడేజా ఉండడం వల్ల ఇషాన్‌కు ప్లేస్ దక్కడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో టీ20ల్లో ఇషాన్ కిషన్ ఇప్పట్లో రీ ఎంట్రీ ఇవ్వడం డౌటే!
గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రిక పర్యటన నుంచి తప్పుకున్నాక, అఫ్గాన్, ఇంగ్లాండ్ సిరీస్‌కు బీసీసీఐ ఇషాన్‌ను పక్కన పెట్టింది. ఇక ఇంగ్లాండ్‌తో రీసెంట్గా ముగిసిన టెస్టు మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇషాన్ విషయంపై స్పందించాడు. 'ఇషాన్ కిషన్ డొమెస్టిక్ టోర్నీలో ఆడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అతడు సెలక్షన్లో ఛాయిస్‌గా ఉంటాడు. ఇప్పటికీ సెలక్షన్ కమిటీ, మేనేజ్మెంట్ ఇషాన్‌తో టచ్‌లోనే ఉంది' అని ద్రవిడ్ అన్నాడు. దీంతో ఇటీవల ఇషాన్ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. జట్టులో స్థానమే లక్ష్యంగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బరోడా రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సోదరులతో కలిసి రీసెంట్గా ఇషాన్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.