Ishan Kishan Net Worth :ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు కొంత కాలం వరకు టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ గురించి క్రికెట్ లవర్స్‌తో పాటు మాజీలు తెగ మాట్లాడుకున్నారు. రంజీల్లో ప్లేయర్లు ఆడాలన్న రూల్‌ను అతడు ఉల్లఘించాడంటూ ఆరోపరణలు ఎదుర్కొంటున్న తరుణంలో బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ పేరు మాయమైపోయింది. దీంతో అతడి కెరీర్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ వాటన్నింటికీ కొంత మేర ఫుల్స్టాప్ పెట్టినట్లు తాజాగా ఐపీఎల్‌లో బరిలోకి దిగాడు. ఇంతకీ ఇషాన్ కిషన్‌కు అసలు ఉన్న ఆదాయ వనరులు ఏంటి ? అంత విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడంటే ?
2022-23 సీజన్ కోసం గ్రేడ్ C కాంట్రాక్ట్ పొందిన ఆరుగురు భారతీయ క్రికెటర్లలో ఇషాన్ ఒకడు. అదే కాంట్రాక్ట్‌ను పొందిన ఇతర ఆటగాళ్లు సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్ మరియు KS భరత్ ఉన్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఆటగాళ్లకు రూ. 1 కోటి వార్షిక వేతనం లభిస్తుంది. దీంతో పాటు 2022 ఐపీఎల్ వేలంలో అతడు అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడ్నిరూ.15.25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది.
వీటితో పాటు ఇషాన్ కిషన్ CEAT, Manyavar, Oppo, Noise ఇలా అనేక దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రమోషన్స్ ద్వారా రెమ్యూనరేషన్స్ అందుకున్నాడట. అతని బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డీల్‌లతో పాటు, అతను సోషల్ మీడియాలో వివిధ బ్రాండ్‌లను ప్రచారం చేయడం ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడని సమాచారం.