IPL 2025 Who Is Ayush Mhatre :2025 ఐపీఎల్ సీజన్ మొదలు కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. కానీ త్వరలో జరగనున్న మెగా వేలంతో అప్పుడే సందడి మొదలైపోయింది. ఈ సమయంలో ఓ యంగ్ ప్లేయర్ అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే ముంబయి బ్యాటర్ ఆయుష్ మత్రే. ఈ 17 ఏళ్ల కుర్రాడు డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని దృష్టి సైతం ఆకర్షించడం గమనార్హం.
ముంబయిలోని వైబ్రెంట్ క్రికెట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన మత్రే డొమెస్టిక్ సర్క్యూట్‌లో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో ఇరానీ కప్‌లో ముంబయి తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 5 మ్యాచుల్లో 35.66 యావరేజ్‌తో 321 పరుగులు చేశాడు. ఇందులో రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై చేసిన 176 పరుగులు చాలా ప్రత్యేకం. ఈ ప్రదర్శనతోనే మత్రే సీఎస్కే దృష్టిని ఆకర్షించాడు. అతడి కంపోజ్డ్, అగ్రెస్సివ్ బ్యాటింగ్, చిన్న వయస్సులో చూపుతున్న మెచ్యూరిటీ ఐపీఎల్ ఫ్రాంచైజీలను మెప్పించాయి.
రంజీ ట్రోఫీలో అరంగేట్రం - తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే మత్రే సెంచరీ బాదాడు. 2024 అక్లోబర్‌లో మహారాష్ట్రపై 127 పరుగులు చేశాడు. సీనియర్ బౌలర్లను సులువుగా ఎదుర్కోవడంలో మత్రే సామర్థ్యం, గేమ్ సెన్స్ ముంబయి సెలెక్టర్లను మాత్రమే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకర్షించింది.