తెలంగాణ

telangana

ETV Bharat / sports

హిట్​మ్యాన్​పై కన్నేసిన ఆ మూడు జట్లు! - IPL 2025 Rohith Sharma - IPL 2025 ROHITH SHARMA

IPL 2025 Rohith Sharma : వచ్చే సీజన్​లో రోహిత్ మెగావేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆ మూడు జట్లు భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI
rohith sharma (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 3:28 PM IST

IPL 2025 Rohith Sharma :ఐపీఎల్ 2025 సీజన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగే సూచనలు కనిపించడం లేదు! ఎందుకంటే ఇప్పటికే అతడు ముంబయి ఫ్రాంఛైజీపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. సుదీర్ఘ కాలం పాటు ఆ జట్టును ముందుకు నడిపించిన హిట్​మ్యాన్​ ఐదు సార్లు విజేతగా కూడా నిలబెట్టాడు. కానీ జట్టు యాజమాన్యం మాత్రం ఐపీఎల్ 2024లో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలను అప్పగించింది. అయినా కూడా అతడు ప్లేయర్​గా కొనసాగాడు. కానీ 2025 సీజన్​కు మాత్రం అతడు ముంబయి తరఫున ఆడే ఛాన్స్ లేదని ప్రస్తుతం మరోసారి వార్తలు వినిస్తున్నాయి. ఇదే సమయంలో అతడు మెగావేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు కాచుకొని ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు ఫ్రాంఛైజీలు హిట్​ మ్యాన్​పై కోట్లు కుమ్మరించే అవకాశాలు ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్ - హిట్​ మ్యాన్​పై గుజరాత్ టైటాన్స్ కన్నేసినట్లు సమాచారం. 2024 సీజన్‌లో గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ విఫలమైంది. హార్దిక్ జట్టును వీడి ముంబయికి వెళ్లిపోవడం ఆ టీమ్​ను బలహీనంగా మార్చింది. అందుకే రోహిత్ వేలంలోకి వస్తే కొనాలని ఆశిస్తోందట. అలానే జట్టుకు పూర్వవైభవం తేవాలని అనుకుంటోందట.

పంజాబ్ కింగ్స్ - ఐపీఎల్ 2024 సీజన్‌లో దారుణంగా విఫలమైంది పంజాబ్ కింగ్స్. దీంతో ఓ ఐకానిక్ ప్లేయర్‌ కోసం ఎదురుచూస్తున్న ఆ జట్టు రోహిత్​పై కన్నేసిందని తెలుస్తోంది. 37 ఏళ్ల వయసున్న హిట్​ మ్యాన్​ మరో మూడేళ్లు ఐపీఎల్ ఆడినా తమ జట్టుకు కలిసొస్తుందని ఆశిస్తోంది. అలాగే ఫిట్‌నెస్ సమస్యలతో పాటు ఇంటర్నేషనల్​ క్రికెట్‌కు దూరంగా ఉన్న తమ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్‌పై వేటు వేయాలని చూస్తోంది. అతడి స్థానాన్ని రోహిత్​తో భర్తీ చేయాలని అనుకుంటోందని సమాచారం.

కేకేఆర్ - ఈ సీజన్​ ట్రోఫీని ముద్దాడిన కేకేఆర్ కూడా రోహిత్ శర్మపై మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. గౌతమ్ గంభీర్‌తో ఉన్న సత్సంబంధాలు, కేకేఆర్‌కు ఆడాలనే రోహిత్ శర్మ కోరిక ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ముంబయి కాకుండా ఇతర ఫ్రాంచైజీ కావాలనుకుంటే తాను కేకేఆర్‌కు ఆడుతానని రోహిత్ అన్నాడు. కాబట్టి అనుభవం కలిగిన ప్లేయర్​ జట్టులో ఉంటే కలిసొస్తుందని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

చిక్కుల్లో పాక్​ కెప్టెన్ - కో ప్లేయర్​ను అలా ట్రోల్ చేసి! - T20 World Cup 2024

తొలి మ్యాచ్​లోనే షాక్​ - 58 పరుగులకే కుప్పకూలిన ఉగాండా

ABOUT THE AUTHOR

...view details