తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండియన్ స్టార్స్​కు బిగ్ షాక్ - వేలంలో అన్ సోల్డ్​గా మిగిలిపోయిన ప్లేయర్స్ వీరే - UNSOLD INDIAN PLAYERS IPL 2025

IPL 2025 మెగా వేలంలో అన్ సోల్డ్​గా మిగిలిపోయిన టీమ్ ఇండియా స్టార్స్ ఎవరంటే?

IPL 2025 Mega Auction Unsold Indian Players
IPL 2025 Mega Auction Unsold Indian Players (source ETV Bharat and Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 26, 2024, 11:12 AM IST

IPL 2025 Mega Auction Unsold Indian Players :ఐపీఎల్ 2025 మెగావేలంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్, కేఎస్ భరత్, సర్ఫరాజ్ ఖాన్ సహా మరికొందరు క్రికెటర్లు అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. వీరిని కొనడానికి ఏ ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు. దీంతో ఈ సీజన్ లో వీరందరూ దాదాపు ఆడే అవకాశం లేదు.

తక్కువ బేస్ ప్రైజ్​తో వచ్చినా!
శార్దూల్ ఠాకూర్ రూ.2 కోట్ల బేస్ ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ రూ.కోటి, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, శ్రీక‌ర్ భ‌ర‌త్ రూ.75 ల‌క్ష‌ల‌తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ వీరిని కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆస‌క్తిని చూప‌క‌పోవ‌డం వల్ల అన్‌ సోల్డ్ ప్లేయ‌ర్లుగా మిగిలిపోయారు.

పృథ్వీ షా
పృథ్వీ షా గత ఐపీఎల్ సీజన్​లో దిల్లీ క్యాపిట‌ల్స్‌ తరఫున ఆడాడు. ఆ సీజన్​లో అంతగా రాణించలేకపోయాడు. అలాగే పేలవ ఫామ్​తో పాటు ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే అతన్ని ఎవరూ కొనలేదని తెలుస్తోంది.

మయాంక్ అగర్వాల్
ఐపీఎల్ 2025 మెగావేలంలో విధ్వంసకర ఓపెనర్ మయాంక్ అగర్వాల్​కు సైతం నిరాశ తప్పలేదు. కనీస ధర రూ.1.5 కోట్లకు వేలంలోకి వచ్చిన ఈ ప్లేయర్​ను తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి కనబరచలేదు. 2024 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ తరపున పెద్దగా రాణించలేదు.

శార్దూల్ ఠాకూర్
టీమ్ ఇండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ 2024 సీజ‌న్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. 21 ప‌రుగులు చేశాడు. అలాగే ఐదు వికెట్లు మాత్ర‌మే తీశాడు. దీంతో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ మొగ్గు చూపలేదు. అలాగే టీమ్ ఇండియా వికెట్ కీపర్ కేఎస్ భారత్, దేవదత్ పడిక్కల్​ను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

సర్ఫరాజ్ ఖాన్
టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా అన్ సోల్డ్​గా మిగిలిపోయాడు. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన సర్ఫరాజ్​ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ మొగ్గు చూపలేదు. కొద్దిరోజుల కిందటే న్యూజిలాండ్‌ పై బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్​లో 150 పరుగులు బాదాడు. అతని బ్యాటింగ్ స్టైల్ టీ20 ఫార్మాట్​కు సెట్ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఏ ఫ్రాంచైజీ అతడి తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి.

వేలంలో అన్ సోల్డ్​గా మిగిలిపోయిన ఇతర ఇండియన్ ప్లేయర్స్
శివమ్ మావి, నవదీప్ సైనీ, యశ్ ధుల్, నమన్ తివారీ, అవినాశ్ సింగ్, అన్మోల్ ప్రీత్ సింగ్, మాధవ్ కౌశిక్, శివాలిక్ శర్మ, పీయూష్ చావ్లా, ఉమేశ్ యాదవ్, రాఘవ్ గోయల్, బైలపూడి యశ్వంత్, రిషి ధావన్, శివమ్ సింగ్, రాజ్ లింబాని

అన్​సోల్డ్​గా మిగిలిపోయిన భారత, ఫారెన్ స్టార్ ప్లేయర్స్​ వీరే

  • డేవిడ్ వార్నర్ - రూ.2 కోట్లు
  • కేన్ విలియమ్సన్‌ - రూ.2 కోట్లు
  • శార్దూల్ ఠాకూర్ - రూ.2 కోట్లు
  • మయాంక్ అగర్వాల్ - రూ. కోటి
  • పృథ్వీ షా - రూ.75 లక్షలు
  • సర్ఫరాజ్‌ ఖాన్‌ - రూ.75 లక్షలు
  • ఉమేశ్‌ యాదవ్ - రూ.2 కోట్లు
  • ఫిన్ అలెన్ - రూ.2 కోట్లు
  • జానీ బెయిర్‌స్టో - రూ.2 కోట్లు
  • డేవాల్డ్ బ్రెవిస్‌ - రూ.75 లక్షలు
  • బెన్ డకెట్ - రూ.2 కోట్లు
  • పాథుమ్ నిశాంక - రూ.75 లక్షలు
  • స్టీవ్ స్మిత్ - రూ.2 కోట్లు
  • పీయూష్‌ చావ్లా - రూ.50 లక్షలు
  • ముజీబుర్ రెహ్మన్‌ - రూ.2 కోట్లు
  • అదిల్ రషీద్ - రూ.2 కోట్లు
  • అకీలా హోస్సేన్ - రూ.1.50 కోట్లు
  • కేశవ్‌ మహరాజ్‌ - రూ.75 లక్షలు
  • ముస్తాఫిజుర్ రెహ్మాన్ - రూ.2 కోట్లు
  • నవీనుల్ హక్ - రూ.2 కోట్లు
  • అల్జారీ జోసెఫ్‌ - రూ.2 కోట్లు
  • నవదీప్‌ సైని - రూ.75 లక్షలు
  • శివమ్ మావి - రూ.75 లక్షలు
  • దిల్షాన్ మధుశంక - రూ.75 లక్షలు
  • ఆడమ్ మిల్నే - రూ.2 కోట్లు
  • క్రిస్ జోర్డాన్ - రూ.2 కోట్లు
  • డారిల్ మిచెల్ - రూ.2 కోట్లు
  • గాస్ అట్కిన్సన్‌ - రూ.2 కోట్లు
  • సికిందర్ రజా - రూ.1.50 కోట్లు
  • కైల్ మేయర్స్ - రూ.1.50 కోట్లు
  • మైకేల్ బ్రాస్‌వెల్ - రూ.1.50 కోట్లు
  • రోస్టన్ ఛేజ్ -రూ.75 లక్షలు
  • తబ్రైజ్ షంసి - రూ.2 కోట్లు
  • జాసన్ హోల్డర్ - రూ.2 కోట్లు
  • టామ్ లాథమ్ - రూ.1.50 కోట్లు
  • షకీబ్ అల్ హసన్ - రూ.కోటి
  • కృష్ణప్ప గౌతమ్ - రూ.కోటి
  • మహమ్మద్ నబీ - రూ.1.50 కోట్లు
  • టిమ్ సౌథీ - రూ.1.50 కోట్లు
  • షై హోప్‌ - రూ.1.25 కోట్లు
  • కేఎస్ భరత్ - రూ.75 లక్షలు
  • అలెక్స్‌ కేరీ - రూ.కోటి
  • లిటన్‌ దాస్ - రూ.75 లక్షలు
  • జోష్‌ లిటిల్ - రూ.75 లక్షలు
  • చరిత్ అసలంక - రూ.75 లక్షలు
  • దునిత్ వెల్లలాగె - రూ.75 లక్షలు
  • డాసున్ శనక - రూ.75 లక్షలు
  • యశ్ ధుల్ - రూ.30 లక్షలు
  • అన్మోల్‌ప్రీత్ సింగ్ - రూ.30 లక్షలు

వేలంలో కావ్య మారన్​ మార్క్ సెలెక్షన్ - పవర్​ఫుల్​గా సన్​రైజర్స్ టీమ్​​

IPL 2025 వితౌట్ వార్నర్​ - అప్పుడు రైనా విషయంలోనూ ఇలానే - బాధపడుతోన్న ఫ్యాన్స్

ABOUT THE AUTHOR

...view details