IPL 2025 Telugu Cricketers : ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఆటగాళ్ల నైపుణ్యాల ఆధారంగా ఫ్రాంఛైజీలు వారిపై కనక వర్షం కురిపించారు. అలా పెద్దగా పేరు లేని కొంతమంది యంగ్ ప్లేయర్స్ వేలంలో అనూహ్యమైన ధర దక్కించుకుని క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. అలానే కోటీశ్వరులుగానూ మారారు. అయితే ఈ ఐపీఎల్ మెగా వేలంలో కొత్తగా ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు కూడా అవకాశం దక్కింది.
IPL 2025 Satyanarayana Raju -కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలం బరిలోకి దిగాడు. అతడి కనీస ధరకే ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాదే సత్యనారాయణ రంజీల్లో ఎంట్రీ ఇచ్చాడు. గత ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మంచి ప్రదర్శన చేశాడు. విజయ హజారే వన్డే ట్రోఫీలోనూ మెరిశాడు. దీంతో ముంబయి అతడిని వేలంలో సొంతం చేసుకుంది. ముంబయి జట్టులో తెలుగు తేజం తిలక్ వర్మ కూడా ఉన్నాడు. ఈ హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను ముంబయి జట్టు రూ.8 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
IPL 2025 Tripurana Vijay - శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురణ విజయ్ను దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతడు దేశవాళీల్లో నిలకడగా రాణించి ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను దిల్లీ జట్టు రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్, 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 16 వికెట్లు తీసి, 150 పరుగులు సాధించాడు. రంజీ, కూచ్‌బెహర్ ట్రోఫీల్లోనూ రాణించాడు. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీలోనూ మంచిగా రాణిస్తున్నాడు.
IPL 2025 Pyla Avinash - విశాఖపట్నం అనకాపల్లి జిల్లా దోసూరు అనే చిన్న గ్రామానికి చెందిన క్రికెటర్ పైలా అవినాశ్. అతడు ఈ సారి ఐపీఎల్ అవకాశాన్ని అందుకున్నాడు. రూ.30 లక్షల కనీస ధరతో పంజాబ్ కింగ్స్ అతడిని దక్కించుకుంది. అవినాష్ తండ్రి సత్యారావు ఓ ఎలక్ట్రీషియన్. అయితే అవినాశ్ క్లబ్ క్రికెట్‌తో పాటు;ఈనాడు; క్రికెట్ టోర్నీలోనూ మంచి ప్రదర్శన చేశాడు. అనంతరం ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లోనూ మంచిగా ఆడాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో 58 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. హిట్టర్‌గా పేరు సంపాదించాడు. దీంతో పంజాబ్ కింగ్ అతడిని దక్కించుకుంది.