Dhoni IPL 2025 CSK CEO Kasi Viswanathan :ఐపీఎల్ - 17లో చైన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. సీఎస్కే ఓటమిని పక్కన పెడితే చాలా మంది ఫ్యాన్స్‌లో ధోనీ రానున్న ఐపీఎల్ సీజన్ ఆడుతాడా? లేదా? అనే సందేహం ఉంది. ఎందుకంటే మహీకి ఇదే చివరి సీజన్ అని కథనాలు వస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ధోని ఐపీఎల్‌కి ఇప్పట్లో రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.
తాజాగా ధోనీ వచ్చే సీజన్లో ఆడతాదా లేదా అన్న విషయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వచ్చే ఏడాది ఆడతాడని ఆశిస్తున్నట్టు తెలిపారు. అంకు ముందు కూడా, అంబటి రాయుడు, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్పతో సహా కొందరు వచ్చే ఏడాది మహీ ఐపీఎల్ ఆడుతాడని చెప్పారు.