IPL 2024 Sunrisers hyderabad VS Mumbai Indians : కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు ముంగిట బోల్తా పడిన సంగతి తెలిసిందే. షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్ తమ జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లినా హర్షిత్ రాణా తన అద్భుతమైన బౌలింగ్‌తో హైదరాబాద్ గెలుపు ఆశలకు గండి కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబయి ఇండియన్స్‌ది అదే పరిస్థితి. చివరి ఓవర్ వరకు గెలుపు రేసులో ఉన్న హార్దిక్ సేన ఆఖరి నాలుగు బంతుల్లో తడబడి మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో ఇప్పుడీ రెండు జట్లు ఈ సీజన్‌లో తమ తొలి విజయంపై గురిపెట్టాయి.
ఈ సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. మార్కో యాన్సన్, భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్‌లతో బలమైన బౌలింగ్ విభాగం కలిగి ఉంది. కాబట్టి తమ స్థాయికి తగ్గట్లు అదరగొడితే ఉప్పల్‌లో బోణీ కొట్టే అవకాశం ఉంటుంది. మిడిలార్డర్‌లో క్లాసెన్, షాబాజ్‌లాగా టాప్ ఆర్డర్‌లో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్‌శర్మ, మార్‌క్రమ్ దూకుడు పెంచి ఆడాలి.
ఇక అత్యంత బలమైన బ్యాటింగ్ విభాగం ఉన్న ముంబయి ఇండియన్స్‌కు సన్‌రైజర్స్ బౌలింగ్ సవాల్‌గా నిలువనుంది ఎందుకంటే కోల్‌కతాతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, బ్రెవిస్ రాణించినా మిగతా వాళ్లు ఫెయిల్ అయ్యారు. కాబట్టి నమన్ ధీర్, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, తిలక్‌వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య పూర్తి స్థాయి ఫామ్‌లోకి వస్తే మాత్రం సన్‌రైజర్స్ బౌలర్లకు పెద్ద సవాలే.