IPL 2024 RR Yuzvendra Chahal 350 Wickets : టీమ్ఇండియా స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్‌లు)లో 350 వికెట్ల మార్క్‌ను టచ్ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకు ఎక్కాడు.
ఐపీఎల్ - 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ పోరులో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఔట్ చేసిన చాహల్ ఈ అ ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
మొత్తంగా ఈ ఘనతను అందుకున్న 11వ బౌలర్‌గా నిలిచాడు చాహల్. అతడి కన్నా ముందు డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహీర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగా, సోహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ ఈ మార్క్ అందుకున్నారు. ఇంకా ఈ అత్యధిక వికెట్ల జాబితాలో భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ తర్వాత పియూశ్ చావ్లా(293 మ్యాచుల్లో 310 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(318 మ్యాచుల్లో 306 వికెట్లు), భువనేశ్వర్ కుమార్(281 మ్యాచుల్లో 297 వికెట్లు) కొనసాగుతున్నారు. ఇక ఐపీఎల్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహలే(201) ఉన్నాడు.