IPL 2024 Qualifier 1 SRH VS KKR :ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ప్లేఆఫ్స్‌లోకు వేళైంది. లీగ్ స్టేజ్ మ్యాచులన్నీ ముగిశాయి. నాకౌట్ దశలో తొలి మ్యాచ్ క్వాలిఫయర్ - 1 మంగళవారం(మే 21) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పోటీపడనున్నాయి. ఇందులో గెలిచిన వారు ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తారు.
అయితే ఈ మోదీ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారింది. మే 13న గుజరాత్ టైటాన్స్ (జీటీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. తర్వాత మే 16న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కూడా వర్షం వల్లే అసంపూర్తిగా జరిగింది. దీంతో ఇప్పుడు జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లోనూ వర్షం ఆటంకం కలిగిస్తుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ వరుణుడు వల్ల మ్యాచ్ రద్దు చేస్తే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
అయితే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో వర్షం పడితే పరిస్థితి ఆధారంగా కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నిర్వహించి ఫలితం వచ్చేలా ట్రై చేస్తారు. అప్పటికీ ఇది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు చేస్తారు. పాయింట్ టేబుల్ ప్రకారం ఎక్కువ పాయింట్లు రన్‌రేట్ ఉన్న జట్టును విజేతను అనౌన్స్ చేస్తారు. ఈ లెక్కన ఈ క్వాలిఫయర్-1లో కోల్‌కతా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో ఈ జట్టు టాప్‌లో ఉంది.