Gukesh Crossed Us President : భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు (Gukesh) 2024వ సంవత్సరాన్ని అద్భుత విజయాలతో ముగించాడు. ఈ ఏడాది అతడు దేశం గర్వించదగ్గ విజయాలు సాధించాడు. దీంతో గుకేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న ప్రకటించింది. ఈ క్రమంలోనే గుకేశ్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడినే మించిపోయాడు. అయితే అది తాను ప్రావీణ్యం పొందిన చెస్ గేమ్‌లో కాదండోయ్, సంపాదనలో. అమెరికా ప్రెసిడెంట్ వార్షిక జీతం కంటే ఈ ఏడాది గుకేశ్ ఆర్జించిందే ఎక్కువ!
2024 ఏడాదిలో గుకేశ్ సంపాదన మొత్తం 1,577,842 డాలర్లు. అది భారత కరెన్సీలో సుమారు రూ.13.6 కోట్లు. వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ మ్యాచ్ శాలరీలు, విన్నింగ్ ప్రైజ్లతోపాటు ప్రైజ్మనీలు కలుపుకొని 2024లో ఈ భారీ మొత్తం అందుకున్నాడు. అయితే ప్రస్తుతం యూఎస్ ప్రెసిడెంట్ వార్షిక జీతం 400,000 డాలర్లుగా ఉంది. అంటే ఈ ఏడాది గుకేశ్ చెస్ సంపాదన, US ప్రెసిడెంట్ జీతం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. అలా ఈ విజయాలు గుకేశ్‌కు పేరు ప్రఖ్యాతలతోపాటు డబ్బును కూడా తెచ్చి పెట్టాయి. ఈ క్రమంలో సంపాదనలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడినే మించిపోయాడు.
కాగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచాక గుకేశ్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్లు నగదు ఇచ్చింది. అలాగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో గెలిచాక అతడు చదువుతున్న వేలమ్మాళ్ విద్యాలయం మెర్సిడెస్ కారు అందజేసింది. అయితే ఈ రెండు ప్రైజ్మనీలు ఇందులో భాగం కాదట. ఇవి కాకుండానే గుకేశ్ సంపాదన రూ. 13+ కోట్లు కావడం విశేషం.
Honourable Prime Minister Shri @narendramodi ji, I am truly grateful and feel humbled to receive the prestigious Major Dhyan Chand Khel Ratna Award. Your words and guidance have always inspired me to strive for excellence and make the nation proud. I promise to continue… pic.twitter.com/hBdpUlroiI
— Gukesh D (@DGukesh) January 2, 2025
ఇక 2024లో చెస్ ప్లేయర్ల సంపాదనలో గుకేశ్ (1,577,842 డాలర్లు) అగ్ర స్థానంలో నిలిచాడు. గుకేశ్ తర్వాత వరుసగా డింగ్ లిరెన్ 1,183,600 డాలర్లు, మాగ్నస్ కార్ల్‌సెన్ 633,369 డాలర్లతో ఉన్నారు. గుకేశ్, డింగ్ లిరెన్ ఈ ఇద్దరు మాత్రమే ఏడాదిలో 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని సంపాదించారు.
మొత్తంగా 17 మంది ఆటగాళ్లు 100,000 డాలర్ల కంటే ఎక్కువ సంపాదించారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండగా, భారత్‌కు చెందిన కోనేరు హంపీ ఒకరు. ఈ జాబితాలో ఆర్ ప్రజ్ఞానంద 202,136 డాలర్లు (9వ స్థానం), అర్జున్ ఎరిగైసి 119,767 డాలర్లు (15వ స్థానం)లో నిలిచారు.
'లిరెన్ కావాలనే ఓడిపోయాడు' - గుకేశ్ విజయంపై రష్యా ఫెడరేషన్ సంచలన ఆరోపణలు
చెస్ ప్రపంచ సింహాసనంపై తెలుగబ్బాయి! - 11 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటిల్ తెచ్చాడుగా!