Cricket Fan Get Cash Prize : ఎక్కడైనా మైదానంలో ఫీల్డర్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టడం చూస్తుంటాం. అలాంటి క్యాచ్ పట్టినందుకు వారికి ప్రశంసలతో పాటు కొన్నిసార్లు నజరానా కూడా అందుతుంది. అయితే సౌతాఫ్రికా డొమెస్టిక్ లీగ్ SAటీ20లో మ్యాచ్ చూస్తున్న ఓ ప్రేక్షకుడు, స్టాండ్స్‌లోకి వచ్చిన బంతిని ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో అతడు లక్షధికారిగా మారిపోయాడు. ప్రేక్షకుడు క్యాచ్ పడితే లక్షాధికారిగా మారడం ఏంటి? అనుకుంటున్నారా?
సౌతాఫ్రికాలో జరుగుతున్న SA టీ20 లీగ్‌కు క్రికెట్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ లో దిగి సత్తాచాటుతుంటారు. అయితే సాధారణంగా ఏ లీగ్‌లో అయినా, మ్యాచ్‌లోనైనా ఆటగాళ్లతో పాటు క్రికెట్‌కు సంబంధించిన వాళ్లు మాత్రమే నజరానా అందుకుంటారు. అలానే మ్యాచుల్లో అద్భుతమైన క్యాచ్‌లు పట్టినందుకు ప్లేయర్స్ నగదు బహుమతి అందుకుంటారు.
కానీ, తాజాగా SA టీ20 లీగ్‌లో స్టాండ్స్‌లోకి దూసుకువచ్చిన బంతిని అక్కడే కూర్చొని ఉన్న ప్రేక్షకుడు సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక్కడే ఓ సర్ప్రైజ్. క్యాచ్ అందుకున్న ప్రేక్షకుడికి లీగ్ నిర్వాహకులు క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేసి అతడి సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఈ సూపర్ క్యాచ్‌కు సదరు ప్రేక్షకుడు ఏకంగా 2 మిలియన్ ర్యాండ్ (భారత కరెన్సీలో రూ.90 లక్షలు) దక్కించుకున్నాడు.
లీగ్‌లో భాగంగా రీసెంట్గా డర్బన్ సూపర్ జెయింట్స్- ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డర్బన్ జట్టు ఆటగాడు కేన్ విలియమ్సన్ 17.3 వ ఓవర్లో బంతిని పుల్ షాట్ ఆడగా, అది స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. బంతి గాల్లో ఉండగానే స్టేడియంలో కూర్చున్న ఓ ప్రేక్షకుడు తన సీటు నుంచి లేచి కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Super catch alert in the stands! 🚨#DurbanSuperGiant's #KaneWilliamson goes berserk as he smashes a colossal six 😮💨
— JioCinema (@JioCinema) January 10, 2025
Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2 | #DSGvPC pic.twitter.com/KwiTpo4yPa
ప్రేక్షకులకు ప్రైజ్‌మనీ
SA టీ20లో క్రికెటర్లకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా ప్రైజ్ మనీ ఇస్తుంటారు. 'క్యాచ్ ఏ మిలియన్' పేరిట దీన్ని నిర్వహిస్తుంటారు. 18ఏళ్లు పైబడిన ప్రేక్షకులు 'వన్ హ్యాండెడ్ క్యాచ్' పడితే ఒక మిలియన్ ర్యాండ్ (రూ.45 లక్షలు) ప్రైజ్‌మనీ అందుతుంది. అదే ఆ ప్రేక్షకుడు స్పాన్సర్ క్లైంట్ అయితే ప్రైజ్‌మనీ రెట్టింపు అవుతుంది. ఇలా విధంగా SA టీ20 లీగ్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆ ప్రేక్షకుడు, లక్షాధికారిగా తిరిగి వెళ్లాడు.
జైస్వాల్ సూపర్ క్యాచ్ - మెరుపు వేగంతో ఇంగ్లాండ్ వికెట్ డౌన్