IPL 2024 New Captains :42 ఏళ్ల ఎంఎస్ ధోనీ తనంతట తాను జట్టు కెప్టెన్సీని వదులుకోవడం వల్ల, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా తర్వాత చెన్నై జట్టుకు నాయకత్వం వహించిన నాలుగో కెప్టెన్‌గా రుతురాజ్ నిలిచాడు. రైనా వైస్-కెప్టెన్‌గా ఉంటూ తాత్కాలిక ప్రాతిపదికన జట్టును నడిపించగా, ధోని వైదొలిగిన తర్వాత 2022లో కొంత కాలం ఫుల్‌టైమ్ కెప్టెన్‌గానూ రైనా బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఐపీఎల్‌లో ముంబయి, చెన్నైని మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌లుగా నిలిపిన రోహిత్, ధోనిని ఈ ఐపీఎల్‌లో అభిమానులు సాధారణ ప్లేయర్‌లుగా చూడనున్నారు.
ఐపీఎల్‌లో తొలిసారి ఇలా
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించడం లేదు. ఐపీఎల్ 2021లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్సీని కోహ్లీ వదిలేశాడు. ఇప్పుడు ముంబయి ఇండియన్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయం వల్ల రోహిత్ శర్మ, సొంత నిర్ణయం మేరకు ధోని కెప్టెన్సీకి దూరమయ్యారు. 2008 ఐపీఎల్ మొదటి సీజన్ తర్వాత ఈ స్టార్ ప్లేయర్‌లు సాధారణ ప్లేయర్‌లుగా ఆడుతున్న లీగ్ ఇదే కావడం గమనార్హం.
2017లో తప్ప, ప్రతి సీజన్‌లో ధోని ఐపీఎల్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే 2022లో ధోనీ కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత ధోని తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు అందుకున్నాడు.
ఇక విరాట్ కోహ్లీ 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కూడా 2013 సీజన్ మధ్యలో నుంచి 2023 వరకు దాదాపు పదేళ్లు ముంబయి ఇండియన్స్‌కి సారథిగా ఉన్నాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా సెలక్టయ్యాడు.