తెలంగాణ

telangana

ETV Bharat / sports

బట్లర్​ సెంచరీ - ఉత్కంఠ పోరులో చివరి బంతికి రాజస్థాన్​ విజయం - IPL 2024 KKR VS RR

IPL 2024 Kolkata Knight Riders vs Rajasthan Royals : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో ఉత్కంఠ మ్యాచ్​లో కోల్​కతాపై రాజస్థాన్​ రాయల్స్​ 2 వికెట్ల తేడాతో గెలిచింది.  మ్యాచ్​ హీరోగా బట్లర్ నిలిచాడు.

IPL 2024
IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 11:44 PM IST

IPL 2024 Kolkata Knight Riders vs Rajasthan Royals: ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో కోల్​కతాపై రాజస్థాన్​ రాయల్స్​ 2 వికెట్ల తేడాతో గెలిచింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​ చివరి బంతికి ఒక పరుగు అవసరమైన సమయంలో లక్ష్యాన్ని ఛేదించింది. మొదటి నుంచి చివరి వరకు క్రీజులో ఉన్న బట్లర్​(107 నాటౌట్​) సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతడే టాప్ స్కోరర్​గా నిలిచాడు. యశస్వి జైశ్వాల్​(19), సంజు శాంసన్​(12), రియాన్ పరాగ్​(34), ధ్రువ్ జురెల్​(2), రవిచంద్రన్ అశ్విన్​(2), రోమన్ పోవెల్​(26) పరుగులు చేశారు. హర్షిత్​ రానా, సునీల్ నైరన్​, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీయగా వైభవ్ అరోరా ఓ వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు మొదట బ్యాటింగ్​ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది. కోల్కతా బ్యాటర్లలో సునీల్ నరైన్ సెంచరీతో మెరిశాడు. చివరలో రింకూ సింగ్ (20) కూడా మెరిశాడు. కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు సాధించాడు. ఫిల్ స్టాల్ (10), శ్రేయస్ అయ్యర్ (11), రస్సెల్ (13), వెంకటేశ్ అయ్యర్ (8) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ తలో 2 వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

రాజస్థాన్​ బౌలర్లకు చుక్కలు(Sunil Narine IPL Century) - ఈ మ్యాచ్​లో ఓపెనర్ సునీల్ నరైన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. తన ధనాధన్ ఇన్నింగ్స్​తో రాజస్థాన్​ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న అతడు 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. నరైన్‌కు ఇదే ఫస్ట్​ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.

ఈ ప్రదర్శనతో ఐపీఎల్​లో సెంచరీ బాదిన మూడో కేకేఆర్‌ ప్లేయర్​గానూ నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రెండో ఆటగాడిగాను (109) నిలిచాడు. ఈ లిస్ట్​లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(158) అగ్ర స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఇండియాకు తిరిగొచ్చిన అనుష్క శర్మ, అకాయ్‌ - Kohli Son

'ఆర్సీబీలో సగం మందికి ఇంగ్లీష్ కుడా రాదు' - IPL 2024 RCB

ABOUT THE AUTHOR

...view details