ETV Bharat / sports

ప్లేయర్లకు జెర్సీ నెంబర్లు ఎందుకు ఇస్తారు ? క్రికెట్​లో వాటి రోల్ ఏంటంటే? - CRICKETERS JERSEY NUMBERS

క్రికెటర్లకు, స్పోర్ట్స్ పర్సనాలిటీలకు జెర్సీ నెంబర్లు ఎందుకు ఉంటాయో తెలుసా?

Jersey Numbers Concept In Sports
Cricketers Jersey Numbers (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 4, 2024, 7:56 PM IST

Jersey Numbers Concept In Sports : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​కు ఉండే ఆదరణే వేరు. చాలా మంది క్రికెట్​ మ్యాచ్​లు ఉన్నాయంటే చాలు ఆఫీసులు, కాలేజీలకు సెలవుపెట్టి మరీ అతుక్కుపోతుంటారు. తమ అభిమాన జట్టుకు మద్దతు ఇస్తుంటారు. అయితే క్రికెటర్లు ధరించే జెర్సీపై నెంబర్లు ఎందుకు ఉంటాయని ఎప్పుడు మీకు సందేహం వచ్చిందా? అందుకు బలమైన కారణాలు చాలా ఉన్నాయి. అవేంటంటే?

అందుకోసమే జెర్సీ నెంబర్లు!
క్రికెటర్లను ప్రేక్షకులు, కామెంటేటర్స్ గుర్తించడానికి జెర్సీ నెంబర్లు ఉపయోగపడతాయి. అందుకే జెర్సీపై నంబర్లను తీసుకొచ్చారు. 1977-1979 మధ్యకాలంలో కెర్రీ ప్యాకర్స్ వరల్డ్ సిరీస్ లో క్రికెటర్లు జెర్సీలపై నంబర్లు వేయడం ప్రారంభించారు. అయితే జెర్సీ నంబర్లు అనే కాన్సెప్ట్ ఆస్ట్రేలియాలో 1995-96 బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్​లో అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రమైంది.

కెప్టెన్ నెంబర్​ 1 జెర్సీ
1999 వరల్డ్ కప్ సమయంలో జెర్సీ నెంబరింగ్ ఒక ప్రామాణిక పద్ధతిగా మారింది. ఈ టోర్నమెంట్​లో కెప్టెన్ నెంబరు 1 జెర్సీని ధరించారు. మిగతా ప్లేయర్స్ 2- 15 మధ్య నెంబర్లున్న జెర్సీలు వేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్లేయర్లను టీవీల్లో మ్యాచ్ లు చూసే ప్రేక్షకులు ఈజీగా గుర్తుపట్టగలిగేవారు.

టెస్టు క్రికెట్​లో ఎప్పుడంటే?
2019లో డే అండ్ నైట్ టెస్టులను ప్రవేశపెట్టిన ఐసీసీ, జెర్సీల మీద ఆటగాళ్ల పేర్లు, నెంబర్ల ముద్రించడానికి అనుమతిచ్చింది. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్​లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తొలిసారిగా జెర్సీపై తమ పేర్లు, నంబర్లతో మైదానంలోకి దిగారు. వెస్టిండీస్​తో జరిగిన టెస్టులో టీమ్​ఇండియా ప్లేయర్స్ తెల్లని జెర్సీలపై పేరు, నంబర్లతో ఆడారు.

జెర్సీ నెంబరు ఉండడం వల్ల లాభం ఏంటంటే?

1. ప్లేయర్ ఐడెంటిఫికేషన్ :
అభిమానులు, కామంటేటర్లు మైదానంలో ఆటగాళ్లను త్వరగా గుర్తించడానికి ఈ జెర్సీ నెంబర్లు ఉపయోగపడతాయి.

2. సంప్రదాయం, వారసత్వం :
కొన్ని జెర్సీ నెంబర్లు లెజెండరీ ప్లేయర్స్​కు నిక్​నేమ్స్​గా మారుతాయి. ఉదాహరణకు సచిన్ జెర్సీ నంబరు 10, రాహుల్ ద్రవిడ్ నంబర్ 99. వీటిని చూస్తే చాలు ప్రేక్షకులు, అలాగే క్రీడాభిమానులు వారిని ఈజీగా గుర్తుపట్టేస్తారు. కొన్ని సార్లు ఆ జెర్సీ నెంబర్స్​తోనే పిలుస్తుంటారు.

3. నమ్మకాలు
చాలా మంది ఆటగాళ్లు సెంటిమెంట్​లను నమ్ముతారు. తాము ఫలానా నెంబరు ఉన్న జెర్సీ ధరిస్తే ఆటలో రాణిస్తామని నమ్మకం పెట్టుకుంటారు. అలా ఈ జెర్సీ నంబర్లను వారు ఎంచుకుంటారు.

4. ఐక్యత
జెర్సీ నెంబర్లు ఆటగాళ్లలో ఐక్యతను పెంపొదిస్తాయి. అలాగే జట్టులో స్ఫూర్తిని నింపుతాయి. మరోవైపు, తమ అభిమాన క్రికెటర్ వేసిన జెర్సీ నంబరు ఉన్నవాటిని దుకాణాల్లో కొందురు కొనుగోలు చేస్తారు. దీంతో జట్టుకు ఆదాయం కూడా సమకూరుతుంది.

జెర్సీ నెంబర్స్​ కోసం ఆ రూల్స్ తప్పనిసరి!
ఫుట్​బాల్ వంటి క్రీడల్లో మాత్రం తమకు కేటాయించిన జెర్సీ నంబర్లనే ఆ ప్లేయర్లు ధరిస్తారు. కానీ క్రికెట్​లో మాత్రం క్రీడాకారులు తమ నచ్చిన నెంబరును జెర్సీపై వేసుకోవచ్చు. అయితే జట్టులోని ఏ ఇద్దరు ఆటగాళ్లకు ఒకే సంఖ్యను కలిగి ఉండకూడదన్న నిబంధన ఉంది.

రిటైర్డ్ జెర్సీ నెంబర్లు
భారత క్రికెట్​కు సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజ ప్లేయర్లు ఎనలేని సేవలు అందించారు. అందుకే వారి గౌరవార్థం సచిన్ జెర్సీ నెంబరు 10, అలాగే ధోనీ జెర్సీ నంబరు 7కు రిటైర్మెంట్ ఇచ్చారు. అంటే భవిష్యత్తులో ఆ నంబర్లతో ఉన్న జెర్సీని ఏ ఆటగాడు కూడా ధరించకూడదని దాని అర్థం. సచిన్ జెర్సీ నంబరును టీమ్​ఇండియా ఆటగాడు శార్దుల్ ఠాకూర్ కొన్నాళ్లు వాడాడు. అయితే ఆ తర్వాత బీసీసీఐ ఆ జెర్సీకి రిటైర్మెంట్ ఇచ్చింది.

ఈ ప్లేయర్ల జెర్సీ నెంబర్​ సేమ్- లిస్ట్​లో ఎవరెవరున్నారంటే? - Same Jersey Number In Cricket

ప్లేయర్లకే కాదు- జెర్సీ నంబర్లకూ రిటైర్మెంట్- మీకు ఈ విషయం తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.