Women Scarifying Jobs After Marriage Reasons : మహిళలకు వివాహం వరమా? శాపమా? ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలతో తమ కాళ్లపై తాము నిలబడుతూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పెళ్లి కొందరి జీవితంలో పెనాల్టీగా మారుతోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. పెళ్లి తర్వాత భారత్‌లో మూడోవంతు మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారని అది దక్షిణాసియాలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలు, కుటుంబ బాధ్యతలు మీద పడడంతో ఉద్యోగాలు మానేస్తున్నావారి కంటే పెళ్లి కాగానే, ఇంకా పిల్లలు పుట్టకముందే పెద్ద సంఖ్యలు కొలువులకు దూరం అవుతున్నారని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది. వివిధ కంపెనీల్లోని మానవ వసరుల విభాగాల అధిపతులతో ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇంచుమించుగా ఇవి విషయాలు తేలాయి.
చిన్న కుటుంబాలు కావడంతో : కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉన్నా చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు మహిళలే ఎక్కువగా తమ కెరీర్‌ను వదులుకుంటున్నారు. పిల్లల పెంపకం బాధ్యతను కొందరు స్వచ్ఛందంగా తీసుకుంటుంటే మరికొందరు కుటుంబ సభ్యులు బలవంతం చేయడంతో నిర్ణయాలను తీసుకుంటున్నారు.
రీసెర్చ్: ప్రెగ్నెన్సీ టైమ్లో కాఫీ తాగితే - బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుందా ?
సమానంగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తే : మన దేశంలో పెళ్లి తర్వాత మహిళలు పుట్టింటిన వదిలి మెట్టినింటికి వెళ్తారు. ఈ ప్రభావం ఉద్యోగాలపై పడుతోంది. ఉన్న ప్రాంతాన్ని వదిలి మారి కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి రావడంతో అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలను చాలామంది యువతులు వదిలేస్తున్నారు. దీన్నే మ్యారేజ్ పెనాల్టీగా ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళలపై ఈ ప్రభావం తక్కువగా ఉంటోంది. అందుకు యువతులకు ఉన్నత చదువులు చెప్పించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. లింగ అధారిత బాధ్యతల్లో మార్పులు చేయాలని మహిళలు, పురుషులు సమానంగా ఇంటి బాధ్యతలు చూసుకోవాలని కూడా అంటున్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే మహిళలు భాగస్వామ్యాన్ని విస్మరించలేదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వివాహ పెనాల్టీ నుంచి మహిళలు తప్పించుకోవాలంటే సాంస్కృతిక, సామాజిక, ఆర్థికపరమైన ఆలోచనల్లో ఉద్యోగాలు ఇచ్చే సంస్థల విధానాల్లో మార్పులు అవసరమని సూచిస్తున్నన్నారు.
మానవ వనరుల విభాగాల అధిపతులతో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసిన విషయాలు
- 34% మంది మహిళలు పని, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- 37% సంస్థలు ప్రసూతి సెలవులు ఇవ్వట్లేదు. దీంతో ఉద్యోగాలు మానేస్తున్నారు
- 17.5% సంస్థల్లోనే పిల్లల ఆలనాపాలనా సదుపాయాలు ఉన్నాయి. అంటే ఉద్యోగాలు ఎందుకు మానేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగానికి దూరమైన మహళలకు పలు ఐటీ కంపేనీలు తీరిగి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. మహిళా శాస్త్రవేత్తలు ఏదైనా కారణంతో మానేస్తే తిరిగి చేరేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అవకాశాలు కల్పిస్తోంది.
గృహహింస బాధితులకు బిగ్ రిలీఫ్ - సత్ఫలితాలిస్తున్న CDEW కేంద్రాలు
తెలంగాణ మహిళలకు గుడ్న్యూస్ - వడ్డీ లేకుండా రూ.లక్షల్లో రుణాలు - ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే?