Dinesh Karthik About Rohit Sharma Performance : తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సొంత గడ్డపై ఓటమిని చవి చూసింది రోహిత్ సేన. అయితే ఇప్పుడు ఈ విషయంలో నెట్టింట తీవ్ర విమర్శల పాలవుతోంది. అటు మాజీలతో పాటు ఇటు క్రీడాభిమానులు ఈ జట్టు గురించి అలాగే ఓటమికి గల కారణాల గురించి తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ ఇప్పుడు రోహిత్ గురించే డిస్కస్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నా ఈ స్టార్ క్రికెటర్ ఈ సిరీస్‌లో తన పేలవమైన పెర్ఫామెన్స్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఈ సిరీస్‌లో చేసిన తప్పిదాల గురించి తన కో ప్లేయర్ దినేశ్ కార్తిక్ వివరించాడు.
టెస్టుల్లోని గత 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ చేసింది కేవలం 133 పరుగులు మాత్రమే. దూకుడుగా ఆడేందుకు వెళ్లిన ప్రతీసారి అతుడు ప్రత్యర్థుల చేతికి చిక్కి ఔటవుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే జరిగింది. పెద్ద షాట్ ఆడేందుకు ప్రయత్నించి మరీ అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడీ స్టార్ క్రికెటర్. అయితే ఇటువంటి అప్రోచ్ వైట్ బాల్ క్రికెట్‌లో ఆరంభంలో అతడ్ని గట్టెక్కించేదేమో కానీ టెస్టుల్లో తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ డీకే రోహిత్‌కు సూచనలిచ్చాడు. అటువంటి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి టెస్టుల్లో పెద్ద షాట్లు ఆడకుండా ఉండాలని కార్తిక్ అన్నాడు.
"టెస్టుల్లో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రోహిత్ దూకుడుగా ఆడాలని అనుకుంటున్నాడని నేను భావిస్తున్నా. వైట్ బాల్ క్రికెట్‌లో ఆడినట్లుగా టెస్టు క్రికెట్‌లో టెక్నిక్స్ ఉపయోగిస్తే అవి ఇక్కడ పనిచేయవు. కొద్దిగా స్ట్రెస్‌కు గురికాగానే రోహిత్ ప్రమాదకరమైన అటాకింగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఓపెనర్‌గా తన బాధ్యతలను స్వీకరించినప్పుడు గతంలో ఏం చేశాడో ఇప్పుడు రోహిత్ అటువంటివి ఏమీ చేయట్లేదు. అప్పుడైతే తను అతడి టెక్నిక్‌ను ఎంతగానో విశ్వసించేవాడు" అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.
స్వదేశంలో ఘోర వైఫల్యం! - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రోహిత్ ఆడుతాడా?
'వాళ్లు రోహిత్ వీక్నెస్ తెలుసుకున్నారు!- బోర్డర్ గావస్కర్లోనూ ఇలా జరిగితే ఇక అంతే!'