ETV Bharat / entertainment

త్వరలోనే ఓటీటీలోకి! - 'దేవర' ఎప్పుడు స్ట్రీమ్ అవ్వనుందంటే?

ఓటీటీలోకి 'దేవర'! - ఎప్పుడు స్ట్రీమ్ అవ్వనుందంటే?

Devara OTT Release
Devara (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 12:42 PM IST

Devara OTT Release : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్​టీఆర్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'దేవర'. పాన్ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం సౌత్ భాషల్లో నవంబర్ 8న అలాగే హిందీలో నవంబర్​ 22న వస్తుందట. అయితే ఈ విషయం గురించి సినిమా రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఓటీటీ రిలీజ్​కు మరికొద్ది రోజులే టైమ్ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా రిలీజ్ చేస్తే చూడాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్​డ్రాప్​లో హై లెవెల్ గ్రాఫిక్స్​తో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్​టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా కనిపించారు. ఎన్​టీఆర్ డ్యుయల్ రోల్​లో కనిపించి అభిమానులను అలరించారు.

'దేవర'లో సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ సంగీతం అందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కింది. దేవర-1 భారీ హిట్ అవ్వడం వల్ల దాని సీక్వెల్ పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్​ 'దేవర 2' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ టైమ్​లోనే పార్ట్‌ 2 కోసం కొన్ని సీన్స్ షూట్‌ చేసినట్లు చెప్పారు. తొలి భాగం మంచి విజయం సాధించడం వల్ల తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. 'దేవర' కంటే దాని సీక్వెల్‌ ఇంకా బాగుంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. స్టోరీ అయితే ప్రస్తుతానికి రెడీగా ఉందని, మరికొంత మెరుగులు దిద్దాలని అన్నారు. 'దేవర' కోసం డైరెక్టర్ కొరటాల శివ ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు.

శిరస్సు వంచి ఈ విషయాన్ని చెబుతున్నాను! : ఎన్టీఆర్​

'దేవర 2' విషయంలో కొరటాల శివ ప్రామిస్ - ' ఆ సీన్స్​ ఫ్యాన్స్​కు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.