ETV Bharat / sports

ప్రత్యర్థులను హడలెత్తించే ఛేజ్ మాస్టర్- కోహ్లీ కెరీర్​లో 5 బెస్ట్ నాక్స్ ఇవే! - VIRAT KOHLI BIRTHDAY SPECIAL

విరాట్ కోహ్లీ కెరీర్​లో ఆడిన టాప్​ 5 బెస్ట్ నాక్స్ ఏంటంటే?

Virat Kohli Birthday Special
Virat Kohli (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 5, 2024, 6:45 AM IST

Virat Kohli Birthday Special : ఫార్మాట్​తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటాడు టీమ్​ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. వన్డే, టీ20, టెస్టులాంటి ఫార్మాట్లలో శైలి మార్చుకుంటూ అదరగొడుతుంటాడు. ఇటీవలే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్​కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ క్రికెటర్, ప్రస్తుతం వన్డే, టెస్టుల్లోనే కొనసాగుతున్నాడు. కాగా, నేడు (నవంబరు 5) కింగ్ కోహ్లీ బర్త్ డే. ఈ రోజు విరాట్ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అభిమానులకు కోహ్లీ తన కెరీర్​లో ఆడిన 5 బెస్ట్ నాక్స్ గురించి ఓ లుక్కేద్దాం.

కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్
2012లో జరిగిన ఆసియా కప్​లో మీర్పూర్‌ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్​తో భారత్ తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు మహ్మద్ హఫీజ్, నాసిర్ జంషెడ్ శతకాలు బాదడం వల్ల నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగులు చేసింది. 330 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్​కు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గంభీర్​ను ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 148 బంతుల్లో 183 పరుగులు బాదాడు. అందులో 22 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కోహ్లీకి దక్కింది. అంతేకాకుండా వన్డేల్లో కోహ్లీ బెస్ట్ స్కోరు ఇదే కావడం గమనార్హం.

శ్రీలంకపై విధ్వంసం
2012 ఫిబ్రవరిలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్​లో శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్​లో లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులు చేశారు. ఈ ట్రై సిరీస్​లో టీమ్​ఇండియా ఫైనల్ చేరాలంటే 40 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. దీంతో భారత్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 86 పరుగులకే ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 16ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 బంతుల్లో 133 పరుగులు బాదాడు. దీంతో టీమ్​ఇండియా సునాయాశంగా విజయం సాధించింది.

ఆసీస్ పై టీ20లో దూకుడు
2016లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో భారత జట్టు టీ20 మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమ్ ఇండియా తడబడింది. 8 ఓవర్లలో కేవలం 49 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 రన్స్ చేశాడు. దీంతో ఆసీస్ ను భారత్ ఓడించింది.

టెస్టుల్లో క్లాసిక్
2018 ఆగస్టులో ఎడ్జ్‌ బాస్టన్​లో ఇంగ్లాండ్​తో టీమ్​ఇండియా టెస్టు మ్యాచ్ ఆడింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 287 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా 50 రన్స్ చేసింది. ఆ తర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు అజింక్య రహానేతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్​ను నిర్మించాడు. 225 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్​తో 149 పరుగులు బాదాడు. దీంతో టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో ఇతర బ్యాటర్లు విఫలమైనా 274 రన్స్ చేసింది.

దాయాది దేశంపై సూపర్ ఇన్నింగ్స్
మెల్​బోర్న్ వేదికగా 2022 అక్టోబరు 23న పాకిస్థాన్, భారత్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమ్​ఇండియా తడబడింది. 31 పరుగులకే కీలక నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ మ్యాచ్​లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లో 82 బంతులు బాదాడు. దీంతో భారత జట్టు దాయాది దేశంపై విజయం సాధించింది.

ఐపీఎల్​ కెరీర్​పై విరాట్ హింట్- మరో మూడేళ్లు ఆర్సీబీతోనే!

కోహ్లీ ఫుడ్ డైట్ ఇదే - విరాట్ మాంసాహారం తినడం ఎప్పుడు మానేశాడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.