తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టేసిన సన్​రైజర్స్​ - వరుసగా నాలుగో విజయం - IPL 2024 - IPL 2024

IPL 2024 DELHI CAPITALS VS SUNRISERS HYDERABAD : ఐపీఎల్‌ - 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో సన్​రైజర్స్​​ హైదరాబాద్ అదరగొట్టేసింది. 67 పరుగులు తేడాతో విజయం సాధించింది.

IPL 2024 DELHI CAPITALS VS SUNRISERS HYDERABAD :
IPL 2024 DELHI CAPITALS VS SUNRISERS HYDERABAD :

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 11:18 PM IST

Updated : Apr 20, 2024, 11:29 PM IST

IPL 2024 DELHI CAPITALS VS SUNRISERS HYDERABAD :ఐపీఎల్‌ - 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో మళ్లీ సన్​రైజర్స్​​ హైదరాబాద్ అదరగొట్టేసింది. తాజా సీజన్​లో జైత్రయాత్ర కొనసాగిస్తూ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్​ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ జట్టు 67 పరుగులు తేడాతో విజయం సాధించింది. దిల్లీ జట్టులో జేక్​ ఫ్రేజర్(65), అభిషేక్ పోరెల్​(42), పంత్​(44), పృథ్వీ షా(16) పరుగులు చేశారు. టి నటరాజన్​ 4 వికెట్లతో సత్తా చాటాడు. మయాంక్ మార్కండే నితీశ్ రెడ్డి తలో రెండు, వాషింటన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ ​ తలో వికెట్ తీశారు.

దిల్లీ ఇన్నింగ్స్​ - భారీ లక్ష్యమే అయినప్పటికీ దిల్లీ క్యాపిటల్స్​ తన ఇన్నింగ్స్​ను దీటుగా ప్రారంభించింది. మొదటి ఓవర్​లో పృథ్వీ షా వరుసగా నాలుగు ఫోర్లు బాదేశాడు. కానీ అదే ఓవర్లో 16 పరుగులకు ఔట్​ అయ్యాడు. డేవిడ్ వార్నర్ (1) రెండో ఓవర్​లోనే పెవిలియన్​ చేరాడు. కానీ జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ చెలరేగడంతో సన్ రైజర్స్​లో కాస్త టెన్షన్ కనిపించింది.
మెక్ గుర్క్ కేవలం 18 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్ల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్​లో అభిషేక్ పోరెల్ కూడా 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 42 పరుగులు సాధించాడు. దీంతో 7 ఓవర్లలోనే దిల్లీ స్కోరు 100 దాటేసింది. కానీ సన్ రైజర్స్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే తన బౌలింగ్​తో మ్యాజిక్ చేశాడు. మెక్ గుర్క్, పోరెల్​లను ఔట్ చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ పోరాడినా ఫలితం దక్కలేదు. 44 పరుగులు చేసి చివరి వికెట్​గా పెవిలియన్ చేరాడు.

సన్​రైజర్స్​ ఓపెనర్లు విధ్వంసం - అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తద్వారా వరుసగా మూడు మ్యాచుల్లో 250పైగా స్కోరు చేసిన మొదటి జట్టుగా రికార్డుకెక్కింది. అలానే టీ20ల్లో అత్యధికంగా 250 ప్లస్ స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో ఇంగ్లాండ్​ కౌంటీ జట్టు సర్రే (3)తో పాటు సమంగా అగ్రస్థానంలో ఉంది..ఇంకా ఈ సీజన్​లో ముంబయి ఇండియన్స్​పై 277, ఆర్సీబీపై 287 పరుగులు చేసింది.

తాజా మ్యాచ్​లో ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ అయితే విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే దిల్లీ బౌలర్లను ఊచకోత కోసేశారు. పవర్‌ప్లేలో అయితే ఈ ఇద్దరిని ఆపడం దిల్లీ బౌలర్ల వల్ల అస్సలు కాలేదు. హెడ్‌ - అభిషేక్‌ తొలి వికెట్‌కు 131 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్‌ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 89 పరుగులు సాధించగా అభిషేక్‌ కేవలం 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 46 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసం ధాటికి సన్‌రైజర్స్‌ పవర్‌ప్లే(6 ఓవర్లు)లో ఏకంగా 125 పరుగులు సాధించి రికార్డ్ కూడా సృష్టించింది. తద్వారా టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్‌ సాధించిన జట్టుగా సన్​రైజర్స్​ జట్టు చరిత్ర కెక్కింది. గతంలో ఐపీఎల్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌ సాధించిన జట్టుగా కేకేఆర్​(2017 - 106 పరుగులు) ఉండేది. ఇప్పుడు సన్‌రైజర్స్‌ దానిని బీట్ చేసింది.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో లేని రూల్‌ ఐపీఎల్​లో ఎందుకు? - IPL 2024

హైదరాబాద్‌ ఓపెనర్ల విధ్వంసం - ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌ - IPL 2024

Last Updated : Apr 20, 2024, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details