తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెగా వేలంలో అండర్ 19 కుర్రాళ్లు- నెక్ట్స్ విరాట్ కోహ్లీ అవుతారా?

2025 మెగా వేలంలో అండర్ 19 కుర్రాళ్లు- లిస్ట్​లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు కూడా

U 19 Players Mega Auction
U 19 Players Mega Auction (source : IANS (Left), AP (Right))

By ETV Bharat Sports Team

Published : Nov 23, 2024, 9:22 PM IST

U- 19 Players Mega Auction 2025 : 2025 ఐపీఎల్ మెగావేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం ప్రారంభం కానుంది. ఈ మెగా వేలం ఆదివారం, సోమవారం రెండు రోజులు జరగనుంది. వేలానికి 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, అందులో 574 మందిని మాత్రమే నిర్వాహకులు షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అయితే వీరిలో టీమ్ఇండియా తరఫున 2024 అండర్- 19 వరల్డ్ కప్ ఆడిన కుర్రాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో వారిపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి వారెవరు? వేలంలో భారీ ధర పలుకుతారా? తెలుసుకుందాం.

  • ఉదయ్ సహారన్ :ఈ యంగ్ ప్లేయర్ అండర్-19 వరల్డ్ కప్​లో టీమ్ఇండియా జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. 7 మ్యాచుల్లో 56.71 సగటుతో 397 రన్స్​తో అదరగొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తనదైన హిట్టింగ్​తో టీమ్ఇండియాకు విజయాలను అందించాడు. ఈ క్రమంలో మెగావేలంలో ఉదయ్​ను ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.
  • ముషీర్ ఖాన్ :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ఈ ముషీర్ ఖాన్. రీసెంట్ అండర్-19 ప్రపంచకప్​లో ముషీర్ ఖాన్ కూడా రఫ్పాడించాడు. ​ఆరు మ్యాచుల్లో 60 సగటుతో 360 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ క్రమంలోనే టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఏడు వికెట్లు కూడా తీశాడు. అలాగే ముషీర్ రంజీల్లోనూ అదరగొట్టాడు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 51.14 సగటుతో 716 పరుగులు చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం.
  • సచిన్ దాస్: యంగ్ క్రికెటర్ సచిన్ దాస్ అండర్-19 ప్రపంచకప్​లో ఏడు మ్యాచుల్లో 303 రన్స్​తో రాణించాడు. అందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. మహారాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్​లోనూ ఈ కుర్ర సంచలనం అదరగొడుతున్నాడు.
  • అర్షిన్ కులకర్ణి :అర్షిన్ కులకర్ణిని గత ఐపీఎల్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అయితే అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఈ యువ ఆల్ రౌండర్ అండర్-19 వరల్డ్ కప్​లో ఏడు మ్యాచుల్లో 27 సగటుతో 189 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది. నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు. మహారాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ కెరీర్​లోనూ రాణిస్తున్నాడు.
  • సౌమీ పాండే :ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అండర్ 19 వరల్డ్ కప్​లో 18 వికెట్లు సత్తా చాటాడు. టీమ్ఇండియా తరఫున టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ఇతడే. అలాగే నమన్ తివారీ, రాజ్ లింబానీ వంటి పేసర్లు కూడా అండర్ 19 వరల్డ్ కప్​లో అదరగొట్టారు.

నెక్ట్స్ విరాట్ అవుతారా?
అయితే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అండర్-19 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులోకి వచ్చాడు. అలాగే ఐపీఎల్​లో అడుగుపెట్టాడు. 2008 అండర్-19 విన్నింగ్ టీమ్​లో విరాట్ సభ్యుడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీని ఆర్సీబీ వేలంలో దక్కించుకుంది. ఆ తర్వాత తన దూకుడును పెంచుకుని ఆర్సీబీలో కీలక ప్లేయర్​గా ఎదిగాడు. అలాగే జట్టు పగ్గాలను సైతం చేపట్టాడు.

ఐపీఎల్ కెరీర్​​లో 252 మ్యాచుల్లో 8 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలతో 8,004 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్​గా నిలవడమే కాకుండా, ఆర్సీబీని అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టీమ్ఇండియా తరఫున 2024 అండర్-19 వరల్డ్ కప్ ఈ ప్లేయర్లలో ఎవరు భవిష్యత్​ విరాట్ కోహ్లీ అవుతారో చూడాలి మరి!

IPL వేలానికి ముందు షాక్- ఆ ప్లేయర్లపై BCCI నిషేధం!

ఐపీఎల్ ఈ సారి ముందుగానే - నెక్స్ట్​ మూడు సీజన్లకూ డేట్స్ ఫిక్స్!

ABOUT THE AUTHOR

...view details