Indian Captains Beat Australia ICC Finals:క్రికెట్లో ఆస్ట్రేలియా అత్యంత బలమైన జట్టు. రెండేళ్లుగా క్రికెట్లో పూర్తిగా ఆసీస్ డామినేషన్ నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళలు 2022లో వన్డే, 2023లో టీ20 వరల్డ్‌కప్ టైటిళ్లు సొంతం చేసుకోగా, 2023లో డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ పురుషుల జట్టు దక్కించుకుంది. ఇక తాజాగా అండర్- 19 వరల్డ్‌కప్‌లోనూ కుర్రాళ్లు ఆధిపత్యం ప్రదర్శించి కప్పును ముద్దాడారు.
ఇలా గత రెండేళ్లలో ఆసీస్ ఐదు ఐసీసీ టైటిళ్లు సాధిస్తే, అందులో మూడుసార్లు ఫైనల్ ఫైట్‌లో భారత్‌నే ఓడించింది. అయితే క్రికెట్లో భారత్ తక్కువేమీ కాదు. పటిష్ఠమైన జట్లలో టీమ్ఇండియా ఒకటి. ఇప్పటివరకూ ఎందరో అత్యుత్తమ ఆటగాళ్లు పలు ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియాకు సారధ్యం వహించారు. అయితే మెగా ఈవెంట్ ఫైనల్స్‌లో మాత్రం ఆస్ట్రేలియాను ఒడించిన భారత కెప్టెన్లు ఇద్దరే ఇద్దరు.
2012 అండర్- 19 టోర్నీలో ఉన్ముక్త్ చంద్ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా తుదిపోరుకు అర్హత సాధించాయి. ఇక ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 47.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ సెంచరీ (111*) తో మెరిశాడు. ఈ విజయంతో ఐసీసీ ఈవెంట్లలో ఆసీస్‌ను ఫైనల్లో ఓడించిన తొలి కెప్టెన్‌గా ఉన్ముక్త్ నిలిచాడు.