India Vs Pakistan Womens T20 World Cup :మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత మహిళల టీమ్ విజయం సాధించింది. పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ (32), జెమీమా రోడ్రిగ్స్ (23), హర్మన్ ప్రీత్ కౌర్ (29), కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గట్టెక్కించారు. స్మృతి మంధాన (7), దీప్తి శర్మ (7) పరుగులు స్కోర్ చేశారు. ఇక పాక్ బౌలర్లలో ఫాతిమా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, సాదియా, ఒమైనా చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.
మ్యాచ్ సాగిందిలా :
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది భారత బౌలర్లు. పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు స్కోర్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిదా దర్ (28) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఓపెనర్ మునీబా అలీ (17), ఫాతిమా సనా (13), మరో ప్లేయర్ అరూబ్ షా (14*) పరుగులు చేశారు.
ఇక భారత బౌలర్ల ధాటికి గుల్ ఫెరోజా డకౌట్ అవ్వగా, సిద్రా అమీన్ (8), ఒమైమా (3), ఆలియా (4) మాత్రం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇక భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (3/19), శ్రేయంకా పాటిల్ (2/6) అదరగొట్టారు. వీరితో పాటు దీప్తి శర్మ, ఆశా శోభన, రేణుకా సింగ్, చెరో వికెట్ పడగొట్టారు.