India Vs England T20 World Cup :టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌ని చిత్తు చేసి సౌతాఫ్రికా ఫైనల్ చేరింది. అయితే ఈ ఫైన్లోని మరో బెర్త్ కోసం ఇప్పుడు ఇంగ్లాండ్, భారత్ ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ రోజు (జూన్ 27) గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగాల్సిన సెమీఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. అక్కడి వాతావరణ సూచన మేరకు, ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం బాగానే ఉందని అంటున్నారు.
మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఎలా?
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు (గయానా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సెమీ ఫైనల్‌కి రిజర్వ్ డే లేదు. అందుకే మ్యాచ్‌ను పూర్తి చేయడానికి మొత్తం 250 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అంటే షెడ్యూల్ చేసిన రోజులోనే మ్యాచ్ నిర్వహణకు అవసరమైతే అదనపు సమయం (ఎక్స్‌టెండెడ్ అవర్స్) ఉపయోగించుకుంటారు. రెండు జట్లు కనీసం పది ఓవర్లు ఆడితేనే ఫలితం ప్రకటిస్తారు.
అదే మొదటి సెమీఫైనల్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి జరిగింది కాబట్టి, నిర్ణీత రోజుకు మొత్తం 60 నిమిషాల అదనపు సమయం మాత్రమే కేటాయించారు. ఈ సెమీఫైనల్ కోసం రిజర్వ్ రోజున, ఆడేందుకు అదనంగా 190 నిమిషాలు కేటాయించారు.